Page Loader
ICC World Cup : ప్రపంచ కప్ విజేత జట్టుకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుందో తెలుసా? 
ICC World Cup : ప్రపంచ కప్ విజేత జట్టుకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుందో తెలుసా?

ICC World Cup : ప్రపంచ కప్ విజేత జట్టుకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుందో తెలుసా? 

వ్రాసిన వారు Stalin
Nov 19, 2023
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

45 రోజుల క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ ఆదివారంతో ముగుస్తుంది. ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కోసం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్లు పోటీపడుతున్నాయి. టోర్నీ ఆద్యంతం ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. ఇప్పటి వరకు ఆడిన మొత్తం 10 మ్యాచుల్లో భారత్ గెలుపొందగా, 10 మ్యాచుల్లో 8 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే ప్రపంచ కప్ ఫినాలేలో గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ లభిస్తుంది. అలాగే 2వ స్థానంలో నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీ ఇస్తామని ఐసీసీ తెలిపింది. ఈ క్రమంలో విజేతగా నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీ ఎంత ఇస్తారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

కప్

విజేత జట్టుకు రూ. 33.31 కోట్లు

విజేత జట్టుకు దాదాపు 4 మిలియన్ డాలర్లు (రూ. 33.31 కోట్లు) చెల్లిస్తామని ఐసీసీ వెల్లడించింది. రెండో స్థానంలో నిలిచిన జట్టుకు 2 మిలియన్ డాలర్లు (రూ. 16.65కోట్లు) అందజేయనున్నారు. ఈ రెండు జట్లు కాకుండా, 10 జట్లకు 40,000 డాలర్ల చొప్పున చెల్లించనున్నారు. ప్రపంచ కప్ టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ 10 మిలియన్ డాలర్లు (రూ.83.29కోట్లు) కావడం గమనార్హం. సెమీ-ఫైనల్స్‌లో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన జట్టుకు 800,000 డాలర్లు బహుమతిగా ఐసీసీ ఇవ్వనుంది. గ్రూప్ దశలో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన జట్లకు 100,000 డాలర్ల చొప్పున అందిచనున్నారు.