IPL-Bangalore-RCB: బెంగళూరు జట్టు గెలవాలంటే పదకొండు మంది బ్యాట్స్ మన్లతో ఆడాలి: మాజీ క్రికెటర్ శ్రీకాంత్
ఐపీఎల్ (IPL) టోర్నీలో బెంగళూరు జట్టు ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు. బెంగళూరు (RCB)జట్టు మొత్తం 11 మంది బ్యాటర్ల తోనే ఆడితే మంచిదని ఎద్దేవా చేశారు. విరాట్ కోహ్లీ (Virat Kohli) తో బౌలింగ్ చేయిస్తే జట్టులోని టాప్ మోస్ట్ బౌలర్ల కంటే అతడే తక్కువ పరుగులిస్తాడని వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టుపై ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల రికార్డు నమోదైన నేపథ్యంలో శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బెంగళూరు జట్టు ఐపీఎల్ టోర్నీలో విజయం సాధించాలంటే బౌలర్లకు బదులుగా 11 మంది బ్యాటర్లే ఉండాలని సూచించాడు.
ప్రతీ మ్యాచ్ కీలకమే
ఫెర్గూసన్ ను, టోప్లీని కూడా హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఒక ఆట ఆడుకున్నారు.విల్ జాక్స్ బౌలింగ్లో కొంచెం ఫర్వాలేదనిపించాడు. డుప్లెసిస్ ఓ రెండు ఓవర్లు, కామెరూన్ ఓ నాలుగు ఓవర్లు, విరాట్ కూడా ఓ మూడు ఓవర్లు బౌలింగ్ వేయాలి. రెగ్యులర్ బౌలర్లకంటే విరాట్ కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడని భావిస్తున్నానని శ్రీకాంత్ చెప్పారు. ప్లే ఆఫ్ రేస్ లో బెంగళూరు జట్టు నిలవాలంటే ప్రతీ మ్యాచ్ ఆ జట్టుకు కీలకమే. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి జట్టుకు తప్పనిసరి విజయాలు చేకూర్చాలని సూచించారు. ఆడిన ఏడు మ్యాచ్ లో ఒక మ్యాచ్ మాత్రమే నెగ్గి కేవలం రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.