Cristiano Ronaldo: పాడెల్ క్రీడ అభ్యున్నతి కోసం క్రిస్టియానో రొనాల్డ్ పెట్టుబడులు
ఈ వార్తాకథనం ఏంటి
ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆట ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ప్రస్తుతం పోర్చుగల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రొనాల్డ్, పాడెల్ క్రీడ అభ్యున్నతి కోసం ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
హోమ్ నేషన్‌లోని సిటీ ఆఫ్ పాడెల్ ప్రాజెక్టులో €5 మిలియన్లు పైగా పెట్టుబడులు పెట్టి పాడెల్ క్రీడకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి రొనాల్డ్ ప్రయత్నిస్తున్నారు.
ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యుత్తమ వ్యక్తి అయిన క్రిస్టియానొ రొనాల్డ్ పాడెల్‌లో పెట్టుబడులు పెట్టడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ వ్యాపారవేత్త ఫిలిప్ డి బోటన్ పేర్కొన్నారు.
Details
తమ కల నిజమైందన్న పోర్చుగీస్ పాడెల్ ఫెడరేషన్ అధ్యక్షుడు
ఇప్పటికే క్రిస్టియానో రొనాల్డ్ బహుళ రంగాలలో పెట్టుబడులు పెట్టి లాభాలను అర్జిస్తున్నాడు. తాజాగా పాడెల్ క్రీడల్లోకి ప్రవేశించడం విశేషం.
పోర్చుగీస్ పాడెల్ ఫెడరేషన్ అధ్యక్షుడు రికార్డో ఒలివేరా మాట్లాడుతూ తమ కల నిజమైందని, ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడాకారుడు పాడెల్ లో పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని వెల్లడించారు.
ఇక పోర్చుగల్ జట్టు తమ క్వాలిఫైయింగ్ క్యాంపెయిన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.
క్రిస్టియానో రొనాల్డో ఐదు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్ చేసి మరోసారి తానెంటో నిరూపించుకున్నాడు.