Page Loader
CWC Qualifiers: ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న జింబాబ్వే సారిథి సీన్ విలియమ్స్
విలియమ్స్ ఈ టోర్నీలో మూడు సెంచరీలు చేశాడు

CWC Qualifiers: ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న జింబాబ్వే సారిథి సీన్ విలియమ్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 30, 2023
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

జింబాబ్వే వేదికగా వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇప్పటికే లీగ్ దశ ముగియడంతో సూపర్ సిక్స్ కు ఆరు జట్లు అర్హత సాధించాయి. ఇక సొంతగడ్డపై మ్యాచులు జరుగుతుండటంతో జింబాబ్వే సారిథి సీన్ విలియమ్సన్ సెంచరీల మోత మోగిస్తున్నారు. ఇప్పటివరకూ ఐదు మ్యాచులు ఆడి మూడు సెంచరీలతో ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. విలియమ్స్ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచుల్లో 133.00 సగటుతో 532 పరుగుల చేశారు. ఇప్పటివరకూ ఏ బ్యాటర్ కూడా 300 పైగా పరుగులు చేయలేకపోవడం విశేషం. ఈ టోర్నీలో సీన్ విలియమ్సన్ వరుసగా 142, 174, 23, 91, 102* పరుగులు చేసి సత్తా చాటాడు.

Details

వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా సీన్ విలియమన్స్

ఈ టోర్నమెంట్‌లో విలియమ్స్ స్ట్రైక్ రేట్ 148.60 ఉండడం విశేషం. వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్ ఈ టోర్నీలో రెండు సెంచరీలు చేసి రెండో స్థానంలో నిలిచాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో విలియమ్స్ కేవలం 70 బంతుల్లో 102 పరుగులు చేశాడు. దీంతో ఈ టోర్నీలో రెండో వేగవంతంమైన సెంచరీని నమోదు చేశాడు. అంతకుముందు సికిందర్ రజా నెదర్లాండ్స్‌పై 54 బంతుల్లో శతకం సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. అమెరికాపై విలియమన్స్ 101 బంతుల్లో 174 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో 150 పరుగుల మార్కును అందుకున్న నాలుగో జింబాబ్వే బ్యాటర్ గా అతను నిలిచాడు. కాగా వరల్డ్ క్వాలిఫయర్‌ టోర్నీలో ప్రస్తుతం విలియమ్సన్‌ టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు