
Paris Olympics Day 7 : ఈరోజు భారత్ పాల్గొనే ఈవెంట్స్ ఇవే.. 2 పతకాలు గెలిచే ఛాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
పారిస్ ఒలింపిక్స్‌లో ఆరో రోజు భారత్ అథ్లెట్లు విఫలమ్యారు. పతకాలు కచ్చితంగా గెలుస్తారన్న కొందరు ప్లేయర్లు నిరాశపరిచారు.
బ్యాడ్మింటన్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, మహిళల బాక్సింగ్‌లో నిఖత్ జరీన్, మహళిల బ్యాడ్మింటన్ పీవీ సింధు ఓటమి చెంది ఇంటిదారిపట్టారు.
ఇవాళ జరిగే పలు క్రీడల్లో అథ్లెట్లు పాల్గొననున్నారు. ఇందులో భారత్ రెండు పతకాలు గెలిచే అవకాశాలు న్నాయి.
Details
మూడో పతకంపై కన్నేసిన మను భాకర్
ఇప్పటికే రెండు పతకాలు సాధించిన మను భాకర్ మూడో పతకంపై కన్నేసింది.
మధ్యాహ్నం 12:30 గంటల నుంచి జరిగే 25 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో ఆమె పాల్గొననున్నారు.
మరోవైపు రెండో గోల్ఫ్ మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలు కానుంది. ఇందులో గగన్‌జీత్, శుభంకర్ వర్మ అమీతుమీ తేల్చుకోనున్నారు.
అనంత్‌జీత్ సింగ్ నరుకా - మధ్యాహ్నం ఒంటి గంటకు
ఆర్చరీ- ధీరజ్ బొమ్మదేవర/అంకిత భకత్ వర్సెస్ దియానంద కొయిరున్నిసా/ఆరిఫ్ పంగెస్తు - మధ్యాహ్నం 1:19 గంటలకు
జూడో- తులికమన్ వర్సెస్ ఇడాలిస్ ఓర్టిజ్- మధ్యాహ్నం 1:32 నుంచి
Details
ఇషాసింగ్ తో తలపడనున్న మను భాకర్
షూటింగ్- మనూ భాకర్, ఇషా సింగ్ - మధ్యాహ్నం 3:30 గంటలకు
సెయిలింగ్- నేత్రా కుమనన్ - మధ్యాహ్నం 3:45 గంటలకు
హాకీ- ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (పురుషుల హాకీ పూల్ బి)- సాయంత్రం 4:45 గంటలకు
బ్యాడ్మింటన్- లక్ష్యసేన్ వర్సెస్ చౌ టిన్ చెన్ - 6:30 గంటలకు
అథ్లెటిక్స్- అంకిత ధయాని - రాత్రి 9:40 గంటలకు