
Uncle Percy: శ్రీలంక డైహార్ట్ ఫ్యాన్ మృతి.. సంతాపం తెలిపిన దిగ్గజాలు
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంక క్రికెట్ జట్టు డైహార్ట్ ఫ్యాన్ అంకుల్ పెర్సీ(87) మరణించారు. ఆయన అసలు పేరు పెర్సీ అమెయ్‌సేకరా.
గతేడాదిగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పెర్సీ సోమవారం కొలంబోలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
శ్రీలంక క్రికెట్ బోర్డు ఆయనకు నివాళులర్పిస్తూ ట్విట్టర్లో పోస్టు చేసింది.ఆయన వైద్యం కోసం క్రికెట్ శ్రీలంక రూ. 50లక్షలు ఆర్థిక సాయం కూడా చేసింది.
1936లో జన్మించిన పెర్సీ, 1979 వన్డే ప్రపంచ కప్ నుంచి శ్రీలంక జట్టును ఉత్సాహపరిచేందుకు స్టేడియానికి వచ్చేవారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్టేడియాల్లో అతడు మ్యాచులను వీక్షించారు.
ముఖ్యంగా 1979 నుంచి గతేడాది వరకు పెర్సీ 43 ఏళ్ల పాటు పెర్సీ మ్యాచులను వీక్షించేందుకు స్టేడియానికి వచ్చేవారు.
Details
రోహిత్ శర్మకు పెర్సీ అంకుల్ వీరాభిమాని
పెర్సీ అంకుల్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వీరాభిమాని, ఆసియా కప్ సందర్భంగా రోహిత్ కూడా అంకుల్ పెర్సీని తన నివాసంలో కలిశారు.
ఇక 2015లో శ్రీలంక పర్యటన సందర్భంగా విరాట్ కోహ్లీ, భారత డ్రెస్సింగ్ రూంలో పెర్సీతో ముచ్చటించి, డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే.
పెర్సీ అంకుల్ మృతి పట్ల శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు సనత్ జయసూర్య, రస్సెల్ ఆర్నాల్డ్, కుమార్ సంగర్కర, మహేలా జయవర్దనే సంతాపం తెలిపారు.
పెర్సీ అంకుల్ మరణం పట్ల సంగక్కర భావోద్వేగానికి గురయ్యారు.
తాను క్రికెట్లోకి అడుగుపెట్టిన దగ్గర్నుంచి రిటైరయ్యే వరకూ పెర్సీ అంకుల్ సపోర్ట్ మాత్రం నిలకడగా కొనసాగిందన్నారు