Delhi Capitals: ఐపీఎల్ 2025.. ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ లిస్ట్ ఖరారు!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్రాంచైజీలకు మొత్తం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇందులో రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్ కూడా ఉంది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాను అందించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లు నవంబర్‌లో మెగా వేలం జరగనుంది. డీసీ తమ రిటెన్షన్ లిస్ట్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి వారు సిద్దంగా ఉన్నారు. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రధాన ఎంపికగా ఉన్నారు.
అభిషేక్ పోరెల్‌కు అదిరే అవకాశాలు
అక్షర్ పటేల్ రెండో ఎంపికగా, కుల్‌దీప్ యాదవ్ మూడవ ఎంపికగా ఉన్నారు. అన్‌క్యాప్డ్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌ను రిటైన్ చేసుకోవాలని డీసీ చూస్తున్నట్లు సమాచారం. వికెట్ కీపింగ్‌కు తోడుగా అతడు మంచి బ్యాటింగ్ చేయగలరు. విదేశీ ప్లేయర్ల ఎంపికలో 'జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్' ట్రిస్టన్ స్టబ్స్‌ను ఆర్‌టీఎం కార్డ్ ద్వారా తిరిగి దక్కించుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. ఐపీఎల్ 2025 నిబంధనల ప్రకారం, రిటైన్ చేసుకునే మొదటి ఆటగాడికి ఫ్రాంఛైజీ రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడవ ఆటగాడికి రూ.11 కోట్లు చెల్లించాలి. నాల్గొవ, ఐదోవ ఆటగాళ్లకు కూడా వరుసగా రూ.8 కోట్లు, రూ.6 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు రూ.4 కోట్లు ఇవ్వాలి. ఇది అభిషేక్ పోరెల్‌కు జాక్‌పాట్ కానుంది
ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ లిస్ట్ (అంచనా)
రిషబ్ పంత్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ అభిషేక్ పోరెల్ (అన్‌క్యాప్డ్) జేక్‌ఫ్రేజర్ మెక్‌గర్క్ (ఆర్‌టీఎమ్) ట్రిస్టన్ స్టబ్స్ (ఆర్‌టీఎమ్)