Page Loader
MS Dhoni: ధోనీకి కోపం వచ్చింది.. ఆ రోజు వాటర్ బాటిల్‌ను గట్టిగా తన్నేశాడు : బద్రీనాథ్
ధోనీకి కోపం వచ్చింది.. ఆ రోజు వాటర్ బాటిల్‌ను గట్టిగా తన్నేశాడు : బద్రీనాథ్

MS Dhoni: ధోనీకి కోపం వచ్చింది.. ఆ రోజు వాటర్ బాటిల్‌ను గట్టిగా తన్నేశాడు : బద్రీనాథ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2024
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో తన భావోద్వేగాలను అదుపులో ఉంచుతూ, ప్రశాంతంగా ఉండడం అతని నైజం. మైదానంలో నిశ్శబ్దంగా ఉంటూ 'కెప్టెన్ కూల్'గా పేరు తెచ్చుకున్నాడు. ఒకానొక సందర్భంలో ధోనీలో కోపాన్ని చూశానని చైన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు బద్రీనాథ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాము ఆర్సీబీతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు 110 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలం అయ్యామని, స్వల్ప వ్యవధిలోనే వికెట్లు పడ్డాయన్నారు.

Details

ధోనీ ముఖం చూడటానికి భయం వేసింది

తాను అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కావడంతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పక్కనే ఉన్న ధోనీ కోపంతో ఊగిపోయాడు. ఆ సమయంలో ఓ చిన్న వాటర్‌ బాటిల్‌ని బలంగా తన్నేశాడు. ఆ సమయంలో ధోనీకి ముఖం చూడటానికి భయం వేసిందని బద్రీనాథ్ పేర్కొన్నారు. ఇక ఐపీఎల్ 2025లో ధోనీ ఆడేదీ లేనిదీ తెలియాల్సి ఉంది.