
Sanju Samson: ధోనీ, కోహ్లీ, రోహిత్‌లు నా కొడుకు కెరీర్‌ను దెబ్బతీశారు.. సంజూ శాంసన్ తండ్రి అవేదన
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత జట్టు మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తన కొడుకును ప్రోత్సహించలేదని సంచలన ఆరోపణలు చేశారు.
తన కొడుకు ప్రతిభను గుర్తించి జట్టులో చోటు కల్పించిన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు విశ్వనాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సంజూ శాంసన్, 9 ఏళ్లుగా జట్టులో స్థిరమైన స్థానం పొందలేకపోయాడు.
రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ అనంతరం అతనికి జట్టులో మరిన్ని అవకాశాలు లభించాయి.
Details
సంజూ ప్రదర్శనపై విశ్వనాథ్ సంతోషం
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంజూ, దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో శతకంతో రాణించాడు.
వరుస మ్యాచ్‌ల్లో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా సంజూ రికార్డు సృష్టించాడు. సంజూ ప్రదర్శనపై విశ్వనాథ్ సంతోషం వ్యక్తం చేశారు.
ధోనీ, కోహ్లీ, రోహిత్‌లు సరైన అవకాశాలు ఇవ్వకపోవడంతో సంజూ కెరీర్‌కు ఆటంకం ఏర్పడిందన్నారు.
అయినప్పటికీ తన కొడుకు ఎప్పుడూ నిస్సహాయుడిగా మారలేదని, భారత జట్టులో స్థానం కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు.
భవిష్యత్తులో టీమిండియాకు సంజూ గొప్ప సేవలు అందిస్తాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.