MS Dhoni: ధోనీని సీఎస్‌కే నుంచి రిలీజ్ చేయాలి.. అశ్విన్ కీలక సూచనలు!
ఈ వార్తాకథనం ఏంటి
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ (IPL) 2027 రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా వెలువడనుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భవితవ్యంపై అతడి మాజీ సహచరుడు రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీని జట్టు నుంచి రిలీజ్ చేసి.. కోచ్ లేదా మెంటార్‌గా నియమించుకోవాలని సీఎస్‌కేకు సూచించాడు. ఇలా చేస్తే రాబోయే వేలంలో జట్టుకు అదనంగా రూ.4 కోట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నాడు. అలాగే ప్రశాంత్ వీర్ (రూ.14.20 కోట్లు), కార్తిక్ శర్మ (రూ.14.20 కోట్లు)లను కూడా విడుదల చేయాలని అశ్విన్ సూచించాడు. గాయాల కారణంగా 2026 సీజన్‌లో ధోనీ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేకపోయిన సంగతి తెలిసిందే.
వివరాలు
ధోనీ నాన్ ప్లేయింగ్ రోల్ తీసుకోవాలి!
ధోనీ భవిష్యత్తుపై స్పందిస్తూ.. ''రాహుల్ చాహర్, ప్రశాంత్ వీర్‌లను చెన్నై వేలంలోకి వదిలేస్తుందని భావిస్తున్నా. ధోనీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
అతడు నాన్ ప్లేయింగ్ రోల్ తీసుకోవచ్చు. అదే జరిగితే జట్టుకు మరో రూ.4కోట్లు లభిస్తాయి. ఆ మొత్తం వేలంలో చెన్నైకి ఉపయోగపడుతుంది.
మాథ్యూ షార్ట్, కార్తిక్ శర్మలతో పెద్దగా ప్రయోజనం లేదని భావించి వారిని రిలీజ్ చేస్తే.. సీఎస్‌కే రూ.40-45కోట్లతో వేలానికి వెళ్లొచ్చు.
నాలుగో స్థానంలో కార్తిక్ శర్మ మంచి ప్రదర్శనే చేశాడు. శివమ్ దూబె, డెవాల్డ్ బ్రెవిస్ కూడా అదే స్థానంలో ఆడగలరు.
ఒకవేళ కార్తిక్ శర్మ కావాలనుకుంటే..అతడిని రిలీజ్ చేసి వేలంలో తక్కువ ధరకు తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేయాలని రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు.
వివరాలు
ఆ ఆటగాళ్లనూ రిలీజ్ చేసే అవకాశం!
నవంబర్ 17లోపు తాము రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ ఫ్రాంఛైజీలకు గడువు విధించింది.
ఇతర జట్ల ఆటగాళ్ల విషయంలోనూ అశ్విన్ తన అంచనాలను వెల్లడించాడు.
ముంబయి ఇండియన్స్‌కు చెందిన దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు షారుఖ్ ఖాన్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన మతిశా పతిరణ, కామెరూన్ గ్రీన్‌లను విడుదల చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
వివరాలు
ధోనీ కంటే బుమ్రానే తెలివైన క్రికెటర్!
ఇదే సందర్భంగా భారత డ్రెస్సింగ్ రూమ్‌లో తన దృష్టిలో అత్యంత తెలివైన క్రికెటర్ ఎవరో కూడా అశ్విన్ వెల్లడించాడు.
ఈ విషయంలో ధోనీ కంటే జస్‌ప్రీత్ బుమ్రానే మెరుగని పేర్కొన్నాడు.
బుమ్రా ప్రత్యర్థి బ్యాటర్‌ను అద్భుతంగా అంచనా వేస్తాడని, తన బౌలింగ్ ప్రణాళికలను ఎలా అమలు చేయాలో అతడికి బాగా తెలుసని ప్రశంసించాడు.