Page Loader
Dinesh Karthik Retirement: ముగిసిన దినేష్ కార్తీక్ ఐపీఎల్ ప్రయాణం.. ఈ విషయంలో ధోనీ కంటే సీనియర్
ముగిసిన దినేష్ కార్తీక్ ఐపీఎల్ ప్రయాణం.. ఈ విషయంలో ధోనీ కంటే సీనియర్

Dinesh Karthik Retirement: ముగిసిన దినేష్ కార్తీక్ ఐపీఎల్ ప్రయాణం.. ఈ విషయంలో ధోనీ కంటే సీనియర్

వ్రాసిన వారు Sirish Praharaju
May 23, 2024
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా వెటరన్ వికెట్‌ కీపర్‌ దినేష్ కార్తీక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన తర్వాత కార్తీక్ తన ఐపీఎల్‌ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఔట్ అయ్యి మైదానం నుంచి వెళుతుండగా దినేశ్‌ కార్తీక్‌ తన కీపింగ్‌ గ్లౌజ్‌లు తీసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఐపీఎల్ 2024లో కార్తీక్‌ 15 మ్యాచ్‌లు ఆడి 326 పరుగులు చేశాడు.

Details 

దినేష్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్

నవంబర్ 2004లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ అరంగేట్రం చేశాడు. భారత్ తరుపున దినేష్ 26 టెస్టులు ఆడి 1025 పరుగులు చేశాడు. చివరిసారిగా 2018లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. 57 క్యాచ్‌లు , 6 స్టంపింగ్‌లు కూడా తీసుకున్నాడు. 94 వన్డే మ్యాచ్ లకు ఆడిన దినేష్ కార్తీక్ 1752 పరుగులు, 64 క్యాచ్‌లు, 7 స్టంప్‌లు తీసుకున్నాడు. 60 టీ20 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ , 686 పరుగులు చేసి 30 క్యాచ్‌లు, 6 స్టంపింగ్‌లు తీసుకున్నాడు.

Details 

ఐపీఎల్ కెరీర్ 

ఐపీఎల్‌లో 2008 ఎడిషన్‌ ప్రారంభం అయ్యినప్పటి నుండి దినేశ్‌ కార్తిక్‌ ఆడుతున్నాడు. 17 సీజన్లలో 257 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. డీకే అత్యధిక స్కోర్ 97 నాటౌట్. కీపర్‌గా 145 క్యాచ్‌లు, 37 స్టంప్‌ ఔట్లు, 15 రనౌట్స్ చేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆరు జట్లకు కార్తిక్‌ ఆడాడు. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ లయన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లకు ఆడాడు. చివరగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు.