
మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న జొకోవిచ్
ఈ వార్తాకథనం ఏంటి
పురుషుల టెన్నిస్‌లో సింగల్స్ నెంబర్ వన్ ర్యాంకును మళ్లీ సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ సాధించాడు. ఇటీవలే స్పెయిన్ కుర్రాడు కార్లోస్ అల్కరాస్ నెంబర్ స్థానానికి ఎగబాకిన విషయం తెలిసిందే. అయితే 14 రోజుల వ్యవధిలోనే నొవాక్ జకోవిచ్ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
ఏటీపీ ర్యాంకింగ్స్‌ను సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం నొవాక్ జొకొవిచ్ 7160 పాయింట్లలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కార్లోస్ అల్కరాస్ 6780 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇండియన్స్ వెల్స్ టోర్నిలో విజేతగా నిలిచిన అల్కరాస్ గతంలో నెంబర్ వన్ ర్యాంకును సాధించిన విషయం తెలిసిందే.
జకోవిచ్
మూడో స్థానంలో సిట్సిపాస్
మయామీ ఓపెన్‌లో కార్లోస్ అల్‌కరాజ్ సెమీస్‌లోనే ఓడిపోయాడు. దీంతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. జొకోవిచ్ కెరీర్ నంబర్‌వన్‌గా ఇది 381వ వారం కావడం గమనార్హం.
5770 పాయింట్లో సిట్సిపాస్ మూడో స్థానం, మెద్వెదెవ్ 5150 పాయింట్లతో నాలుగో స్థానం, కాస్పర్ రూడ్ 5005 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
ఏటీపీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ అగ్రస్థానంలో కొనసాగడంతో పలువురు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.