Champions Trophy: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ఐసీసీ ఎన్ని కోట్లు ఇస్తుందో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి సమయం దగ్గరపడింది. టైటిల్ కోసం భారత్-న్యూజిలాండ్ తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మార్చి 9న (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. క్రికెట్ ప్రేమికులు ఈ గ్రాండ్ ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచే జట్టుకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుందనే విషయంపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
Details
విన్నర్‌కు భారీ నగదు పురస్కారం
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచే జట్టు పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ అందుకోనుంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన ప్రైజ్ మనీ వివరాల ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టుకు దాదాపు రూ. 19.48 కోట్లు ($2.24 మిలియన్) లభిస్తాయి.
ఫైనల్‌లో ఓడిపోయిన జట్టు రూ. 9.74 కోట్లు ($1.12 మిలియన్) పొందుతుంది.
Details
సెమీ-ఫైనలిస్టులకు కూడా భారీ ప్రైజ్ మనీ
సెమీ-ఫైనల్స్‌లో ఓడిన జట్లు అయిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రూ. 4.87 కోట్లు ($5,60,000) చొప్పున పొందుతాయి. ఇక గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన జట్లకు కూడా ప్రైజ్ మనీ లభిస్తుంది.
ఐదవ, ఆరవ స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు $3,50,000 (సుమారు రూ. 3.04 కోట్లు) అందుకుంటాయి.
ఇక ఏడవ, ఎనిమిదవ స్థానాల్లో నిలిచిన పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లకు $1,40,000 (సుమారు రూ. 1.22 కోట్లు) లభిస్తాయి.
ఐసీసీ మొత్తం ప్రైజ్ మనీ ఎంతంటే?
2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ మొత్తం **$6.9 మిలియన్లు (సుమారు రూ. 60 కోట్లు) కేటాయించింది. ఇది 2017 ఛాంపియన్స్ ట్రోఫీ కంటే 53శాతం అధికంగా ఉంది.