Page Loader
IPL 2025 : ఐపీఎల్ 2025లో స్మార్ట్‌ రీప్లే సిస్టమ్.. మ్యాచ్ ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?
ఐపీఎల్ 2025లో స్మార్ట్‌ రీప్లే సిస్టమ్.. మ్యాచ్ ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

IPL 2025 : ఐపీఎల్ 2025లో స్మార్ట్‌ రీప్లే సిస్టమ్.. మ్యాచ్ ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2025
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉంది. ఇక మార్చి 22 నుంచి జరుగుతున్న ఐపీఎల్‌ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ హై-స్పీడ్ హాక్-ఐ కెమెరాలతో కూడిన స్మార్ట్‌ రీప్లే సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. క్రికెట్ మ్యాచ్‌ల్లో తీసుకునే నిర్ణయాలను మరింత ఖచ్చితంగా, వేగంగా అందించడమే దీని లక్ష్యం. ఈ సిస్టమ్ ద్వారా అంపైర్లు రనౌట్లు, ఎల్‌బీడబ్ల్యూ, నోబాల్ వంటి కీలక నిర్ణయాలను సులభంగా తీసుకోగలుగుతారు. 17వ ఐపీఎల్ సీజన్‌లో ఈ టెక్నాలజీని మొదటిగా ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2025 ఐపీఎల్ కోసం దీన్ని మరింత అభివృద్ధి చేశారు.

Details

స్మార్ట్ రీప్లే సిస్టమ్‌ విశేషాలు

ఈ సిస్టమ్‌లో 8 హై-స్పీడ్ హాక్-ఐ కెమెరాలు ప్రత్యేకంగా అమర్చారు. అంపైర్ల కోసం రియల్‌ టైమ్‌ ఇమేజెస్, డేటా అందించేందుకు హాక్-ఐ ఆపరేటర్లు పనిచేస్తారు. టీవీ అంపైర్, హాక్-ఐ అంపైర్ మధ్య టీవీ ప్రసార డైరెక్టర్ సమన్వయం కల్పిస్తారు. హాక్-ఐ అంపైర్ నేరుగా టీవీ అంపైర్‌కు విజువల్స్ అందిస్తారు, వీటిని విభిన్న కోణాల్లో విశ్లేషించి నిర్ణయం తీసుకుంటారు. దీని ద్వారా రనౌట్లు, క్యాచ్‌లు, ఎల్‌బీడబ్ల్యూ, నోబాల్ వంటి నిర్ణయాలను అత్యంత ఖచ్చితంగా, స్పష్టంగా ప్రకటించగలుగుతారు. అంపైర్ల నిర్ణయాలు ప్రేక్షకులకు కూడా సులభంగా అర్థమయ్యేలా విజువల్ ప్రదర్శన ఉంటుంది.

Detals

థర్డ్ ఎంపైర్ నిర్ణయాలు మరింత వేగంగా

ఈ టెక్నాలజీతో ఐపీఎల్ 2025లో మ్యాచ్‌లు మరింత పారదర్శకంగా, న్యాయంగా సాగనున్నాయి. బీసీసీఐ అభిప్రాయం ప్రకారం, ఈ సిస్టమ్ ఆటగాళ్లు, అభిమానులు, అంపైర్లు అందరికీ ప్రయోజనకరం కానుంది.