LOADING...
KL Rahul vs Umpire: బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్ళమంటారా?.. అంపైర్‌పై రాహుల్ ఆగ్రహం!

KL Rahul vs Umpire: బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్ళమంటారా?.. అంపైర్‌పై రాహుల్ ఆగ్రహం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2025
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-ఇంగ్లండ్ మధ్య కొనసాగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ లో ఉద్రిక్తత పెరిగింది. ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆసక్తికరమైన, మరికొన్ని ఉద్రిక్తఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్, భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మధ్య తీవ్ర వాగ్వాదం సంభవించగా,ఆ తర్వాత కేఎల్ రాహుల్-ఆన్-ఫీల్డ్ అంపైర్ కుమార్ ధర్మసేన మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ ఎపిసోడ్‌ రూట్ బౌండరీ కొట్టిన తర్వాత ప్రారంభమైంది. షాట్ కొట్టిన వెంటనే అతను ప్రసిద్ధ్‌ను ఎగతాళి చేయడంతో, ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో, ఆన్-ఫీల్డ్ అంపైర్లు అహ్సాన్ రజా, కుమార్ ధర్మసేన మద్దతుగా జోక్యం చేసుకుని ఇరువురితోనూ మాట్లాడి శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నించారు.

Details

ప్రసిద్ధ్ ను అండగా నిలిచిన కేఎల్ రాహుల్

అయితే ఈ సంఘటనపై భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ స్పందిస్తూ తన సహచరుడైన ప్రసిద్ధ్‌కు అండగా నిలిచాడు. రాహుల్ నేరుగా ధర్మసేనను సంప్రదించి, రూట్ ప్రవర్తనపై వివరణ కోరాడు. అయితే, రాహుల్ మాట్లాడిన తీరు అంపైర్ ధర్మసేనకు నచ్చకపోవడంతో, ఆయన కోపంగా స్పందించి రాహుల్‌ను మందలించారు. అంతటితో ఆగకుండా ఈ వ్యవహారాన్ని మ్యాచ్ అనంతరం ఐసీసీకి నివేదిస్తానని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన రాహుల్, ధర్మసేనను నిలదీశారు. 'మరేం చేయమంటావు? నిశ్శబ్దంగా ఉండాలా? మేము కేవలం బ్యాటింగ్ చేసి, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నారా? మైదానంలో ఏం జరుగుతున్నదీ చూడటం మీ బాధ్యత కాదా? అని అంపైర్‌ను ప్రశ్నించారు.