
యూఎస్ ఓపెన్‌లో విజయం సాధించిన డొమినిక్ థీమ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రియన్ స్టార్ డొమినిక్ థీమ్ ఎట్టకేలకు యూఎస్ ఓపెన్‌లో సత్తా చాటాడు. 25వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్‌ను డొమినిక్ థీమ్ ఓడించి రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు.
గంట 54 నిమిషాల పాటు ఉత్కంఠంగా జరిగిన ఈ మ్యాచులో 6-3, 6-2, 6-4 తేడాతో డొమినిక్ థీమ్ విజయం సాధించాడు.
థీమ్ 2021 తర్వాత మొదటిసారిగా గ్రాండ్ స్లామ్‌లో మొదటి మ్యాచ్‌ను గెలుచుకోవడం విశేషం.
ఈ మ్యాచ్‌లో థీమ్ మొత్తం 96 పాయింట్లు సాధించి, ఎనిమిది ఏస్‌లను సాధించాడు. థీమ్ మొదటి సర్వేలో 73శాతం, రెండో సర్వేలో 58 విజయ శాతాన్ని నమోదు చేశాడు.
Details
స్టార్ బెన్ షెల్టన్ తలపడనున్న డొమినిక్ థీమ్
థీమ్ ఇటీవల గ్రాండ్‌స్లామ్‌లలో రాణిస్తున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లలో మొదటి రౌండ్ నుండి నిష్క్రమించిన తర్వాత చివరికి యూఎస్ ఓపెన్ లో రాణించాడు.
అతను తన చివరి ఆరు గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లలో ఒక విజయం కూడా సాధించలేదు.
ఇటీవల ఏటీపీ 250 ఫైనల్ కు చేరుకున్న థీమ్, సెబాస్టియన్ బేజ్ చేతిలో వరుస సెట్లలో ఓడిపోయారు.
మాజీ ప్రపంచ మూడో ర్యాంకర్ థీమ్ రెండో రౌండ్‌లో అమెరికా స్టార్ బెన్ షెల్టన్‌తో తలపడనున్నాడు.