Page Loader
Virat Kohli: విమర్శలను పట్టించుకోను.. 49వ శతకంపై కోహ్లీపై కీలక వ్యాఖ్యలు
విమర్శలను పట్టించుకోను.. 49వ శతకంపై కోహ్లీపై కీలక వ్యాఖ్యలు

Virat Kohli: విమర్శలను పట్టించుకోను.. 49వ శతకంపై కోహ్లీపై కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 07, 2023
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీతో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక టర్నింగ్ పిచ్ మీద కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ, శతకంతో వన్డేల్లో క్రికెట్ గాడ్ సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు. 119 బంతుల్లో పది ఫోర్ల సాయంతో సెంచరీ చేసిన కోహ్లీ, టీ20, వన్డేలు కలిపి వైట్ బాల్ క్రికెట్‌లో 50 సెంచరీలు కొట్టిన తొలి క్రికెటర్‌గా ప్రపంచరికార్డును సృష్టించాడు. ఈ మ్యాచులో రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, జడేజా, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లు వేగంగా ఆడగా, కోహ్లీ నెమ్మదిగా ఆడాడు.

Details

ఈడెన్ గార్డెన్స్ లో సెంచరీ చేయడం సంతోషంగా ఉంది

కోహ్లీ స్వార్థపూరిత ఇన్నింగ్స్ ఆడాడని కొందరు విమర్శలు చేశారు. అయితే దీని వెనుక కారణాన్ని విరాట్ కోహ్లీ వివరించాడు. ఈ మ్యాచులో రోహిత్, శుభ్‌మాన్ గిల్ గొప్ప ఆరంభాన్ని ఇచ్చారని, అయ్యర్ కూడా 87 బంతుల్లో 77 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడని, కోహ్లీ చెప్పాడు. ఆసియా కప్‌లో మెరుగైన ప్రదర్శన ప్రపంచకప్‌కు ముందు తనను మంచి మానసిక స్థితిలో నిలిపిందని, హార్దిక్ జట్టులో లేకపోవడం కొంచెం లోటు అనిపించిందన్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో ఇంతమంది ప్రేక్షకుల మధ్య తాను ఈ రికార్డును సాధించడం గొప్పగా ఉందన్నారు. అయితే పిచ్ నెమ్మెదిగా ఉండటంతో పరుగులు చేయడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చిందని, తాను విమర్శలను పట్టించుకోనని కోహ్లీ వెల్లడించారు.