
Rajasthan Royals: ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్‌కు డబుల్ షాక్..!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది.
స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ సంజూ శాంసన్‌తో పాటు మొత్తం జట్టుకూ భారీ జరిమానాలు విధించారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేస్తూ 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది.
యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. అనంతరం 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది.
హెట్మయర్ (32 బంతుల్లో 52), శాంసన్ (28 బంతుల్లో 41) కొంత పోరాడినా ఫలితం లేకుండా పోయింది
Details
ప్లేయర్లకు జరిమానాలు
తాజాగా ఐపీఎల్ కమిటీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లను సమయానికి పూర్తిచేయడంలో విఫలమైంది.
దీనిపై కఠిన చర్యలు తీసుకున్న ఐపీఎల్ నిర్వాహకులు కెప్టెన్ సంజూ శాంసన్‌కు రూ.24 లక్షల జరిమానా విధించారు.
అలాగే ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్లేయింగ్ ఎలెవన్‌లోని మిగతా ఆటగాళ్లకు రూ.6 లక్షల చొప్పున లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా (ఏది తక్కువైతే అది) విధించారు.
ఇది రాజస్థాన్ రాయల్స్‌కు ఈ సీజన్‌లో రెండోసారి స్లో ఓవర్ రేట్ జరగడం.
ఇదివరకు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టాండ్-ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై రూ.12 లక్షల జరిమానా విధించబడిన సంగతి తెలిసిందే.