Rahul Dravid : రాహుల్ ద్రావిడ్‌కు బంపరాఫర్ ఇచ్చిన బీసీసీఐ.. కాంట్రాక్ట్ గడువు పొడగింపు..!
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఓటమి తర్వాత టీమిండియా(Team India) ప్లేయర్లు నిరాశకు గురయ్యారు. దీంతో టీమిండియా కోచ్‌తో సహా పలువురు సీనియర్ల ప్రస్థానంపై అనుమానాలు మొదలయ్యాయి. వచ్చే ప్రపంచ కప్ సమయానికి ప్రస్తుత టీంలో కీలకంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ లాంటి ప్లేయర్లు అందుబాటులో ఉంటారా లేదా అనేది సందేహమే. ఈ సమయంలో కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) తప్పించటం ఖాయమనే వార్తలు జోరందకున్నాయి. ఈ తరుణంలో బీసీసీఐ(BCCI) రాహుల్ ద్రావిడ్‌కు బంఫరాఫర్ ఇచ్చింది. టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌కు మరో రెండేళ్ల కాంట్రాక్ట్ ను ఆఫర్ చేసే అవకాశం ఉంది.
కోచ్ పదవిపై ద్రావిడ్ తో చర్చలు జరిపిన బీసీసీఐ
కాంట్రాక్ట్ ను పొడిగించేందుకు బీసీసీఐ గత వారం రాహుల్ ద్రావిడ్ ను సంప్రదించింది. అయితే ఈ ఆఫర్ ను ద్రావిడ్ అంగీకరించాడా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. ఒవేళ ద్రావిడ్ నుంచి సానుకూల స్పందన రాకుంటే ప్రస్తుత ఎన్‌సీఏ ఛీప్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) కు కోచ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ మునుపటి ఒప్పందం 2023 ప్రపంచ కప్‌తో ముగిసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 10 నుంచి భారత్, దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూరులో భారత్ 3 టీ20లు, 3 వన్డే మ్యాచులను ఆడనుంది.