Loading...
Rohit-Kohli: రోహిత్-కోహ్లీని జట్టు నుంచి తప్పిస్తే రచ్చే.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!
రోహిత్-కోహ్లీని జట్టు నుంచి తప్పిస్తే రచ్చే.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!

Rohit-Kohli: రోహిత్-కోహ్లీని జట్టు నుంచి తప్పిస్తే రచ్చే.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2026
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను జట్టు నుంచి తప్పించడం అంత సులభం కాదని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. వారు ఇంకా ఆడాలని అనుకుంటే వారిని ఎవరూ సులభంగా పక్కన పెట్టలేరని పేర్కొన్నాడు. ఒకవేళ బలవంతంగా జట్టు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తే అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని హెచ్చరించాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే రోహిత్ శర్మకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వివరాలు

'వారిని ఎవరూ టచ్ చేయలేరు'

తన యూట్యూబ్ ఛానల్‌లో అశ్విన్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడాలని కోరుకుంటే వారిని ఎవరూ టచ్ చేయలేరు.

అందుకు కారణం వారు నెలకొల్పిన రికార్డులేనని చెప్పాడు. రోహిత్ శర్మ ఇప్పటికే వన్డేల్లో దాదాపు 12 వేల పరుగులు సాధించాడని, అలాంటి ఆటగాడిని సులభంగా జట్టు నుంచి తప్పించడం సాధ్యం కాదని పేర్కొన్నాడు.

అలాగే విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, తన బ్యాటింగ్‌తో ఇప్పటికే తానెంత గొప్ప ఆటగాడో నిరూపించుకున్నాడని కొనియాడాడు.

వివరాలు

అభిమానుల మద్దతు పెద్ద బలం

కోహ్లీ, రోహిత్ ఇద్దరికీ ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానగణం ఉందని అశ్విన్ గుర్తు చేశాడు.

వారిని చూడటానికే అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతారని, అలాంటి స్టార్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పిస్తే తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుందని వ్యాఖ్యానించాడు.

ఒకవేళ రోహిత్, కోహ్లీని జట్టు నుంచి తప్పిస్తే స్టేడియం పైకప్పు లేచిపోవడం గ్యారంటీ అంటూ అభిమానుల స్పందన ఎంత తీవ్రంగా ఉంటుందో అశ్విన్ సరదాగా వ్యాఖ్యానించాడు.

ADVERTISEMENT

వివరాలు

బౌలర్ల విషయంలో పరిస్థితి భిన్నం

బౌలర్ల గురించి కూడా అశ్విన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

సిరాజ్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లు జట్టులో లేకపోయినా కొంతమంది మాత్రమే ప్రశ్నిస్తారని, స్టార్ బ్యాటర్ల విషయంలో జరిగేంత చర్చ బౌలర్ల గురించి జరగదని చెప్పాడు.

అయితే భవిష్యత్తులో బౌలర్లకు కూడా అదే స్థాయిలో అభిమానుల మద్దతు లభించి, వారిని జట్టు నుంచి తప్పించే పరిస్థితి రాకుండా ఉండాలని తాను కోరుకుంటున్నానని అశ్విన్ వెల్లడించాడు.

అభిమానులు బౌలర్ల కోసం కూడా అదే స్థాయిలో గళమెత్తే రోజు రావాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు.

ADVERTISEMENT