
Free Palestine: 'ఫ్రీ పాలస్తీనా' టీ-షర్ట్‌తో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో వ్యక్తి హల్‌చల్
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్స్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడికి నిరసనగా 'ఫ్రీ పాలస్తీనా' టీ-షర్ట్ ధరించిన ఓ వ్యక్తి మ్యాచ్ జరుగుతున్న సమయంలో పిచ్‌లోకి వచ్చి హల్ చల్ చేశాడు.
అంతేకాదు, కోహ్లీని కౌగిలించుకునే ప్రయత్నం కూడా ఆ వ్యక్తి చేశాడు.
ఎర్రటి షార్ట్ ధరించిన వ్యక్తి, ముందు భాగంలో 'పాలస్తీనాపై బాంబింగ్ ఆపండి', టీ షర్ట్ వెనుక 'ఫ్రీ పాలస్తీనా' అనే సందేశంతో తెల్లటి టీ షర్టు ధరించాడు.
పాలస్తీనా రంగులలో ముఖానికి మాస్క్‌ను కూడా అతను ధరించాడు.
ఈ క్రమంలో మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయింది. అనంతరం భద్రతా సిబ్బంది అతడిని పిచ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విరాట్‌పై చేయి వేసే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి
Man Enters In The Ground With Wearing " Free Palestine " t-shirt. pic.twitter.com/jTdNvXJOLI
— Aaquib Pathan (@imaaquib02) November 19, 2023