Page Loader
England: క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లండ్ అరుదైన ఘనత .. 5లక్షల పరుగుల ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు
క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లండ్ అరుదైన ఘనత .. 5లక్షల పరుగుల ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు

England: క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లండ్ అరుదైన ఘనత .. 5లక్షల పరుగుల ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2024
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ జట్టు క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ అనుభవంలో 5 లక్షలకు పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్‌ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌ 1,082వ టెస్టు అయినా ఇంగ్లండ్‌ జట్టు కెరీర్‌లో ప్రత్యేకమైన ఘనతను అందుకుంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 4,28,868 పరుగులతో రెండో స్థానంలో, భారత్‌ 2,78,751 పరుగులతో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో ఆడుతున్న ఇంగ్లండ్‌ రెండో టెస్టులో భారీ ఆధిక్యాన్ని నమోదు చేసింది.

Details

ఆధిక్యంలో ఇంగ్లండ్

రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 378/5 పరుగులతో ఉంది. దీంతో 533 పరుగుల లీడ్‌ను తెచ్చుకుంది. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులకే ఆలౌటైంది. ఇక ఇంగ్లండ్‌ 280 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌ విజయం సాధిస్తే, మూడు టెస్టుల సిరీస్‌ను ఈ జట్టు కైవసం చేసుకుంటుంది.