Jofra Archer: బార్బడోస్ క్లబ్ తరుఫున బరిలో జోఫ్రా ఆర్చర్.. సమచారం లేదన్న ఈసీబీ
వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జట్టుకు ఘోరపరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. పసికూన అప్గానిస్తాన్‌తో పాటు శ్రీలంక చేతిలో ఓడి దారుణ విమర్శలను మూటకట్టుకుంది. ఈ ఓటమితో ఇంగ్లండ్ జట్టు వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంలో ఆ జట్టు కీలక ఆటగాడు జోఫ్రా ఆర్చర్(Jofra Archer) కు ఐపీఎల్ ఆడోద్దని ఆ దేశ క్రికెట్ బోర్డు సూచించింది. తాజాగా జోఫ్రా ఆర్చర్ బార్బడోస్ క్లబ్ తరుఫున మ్యాచ్ ఆడాడు. ఫాస్ట్ బౌలర్ ఆర్చర్ గాయపడి తిరిగి రావడంతో ఇంగ్లండ్ జట్టు అవాక్కైంది. దీనిపై ఆ జట్టు చీఫ్ రాబ్ కీ స్పందించాడు.
టీమిండియా జరిగే టెస్ట్ సిరీస్ కు ఆర్చర్ దూరం
ఆర్చర్ ఆడడం గురించి తనకు సమాచారం లేదని, అతను జట్టుకు తెలియకుండానే మ్యాచ్ ఆడాడని రాబ్ కీ పేర్కొన్నాడు. జూన్‌లో జరిగే 2024 T20 ప్రపంచ కప్‌కు అతను ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో ప్రవేశించడానికి అతనికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అనుమతి నిరాకరించింది. టీమిండియాతో జరిగే టెస్ట్ జట్టులో ఆర్చర్ కు స్థానం లభించలేదు. టెస్టు సిరీస్ జనవరి 25న హైదరాబాద్‌లో టీమిండియాతో ఇంగ్లండ్ తలపడనుంది.