IND vs ENG: రెండో టీ20కి రోజు ముందే జట్టును ప్రకటించిన ఇంగ్లండ్ ..
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగుతున్న ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది.
ఈ నేపథ్యంలో శనివారం చెన్నై వేదికగా జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లాండ్ జట్టు పట్టుదలతో ఉంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంది. ఇక, రెండో టీ20 మ్యాచ్‌కు ఒక రోజు ముందు జట్టును ప్రకటించింది.
గస్ అట్కిన్సన్ స్థానంలో బ్రైడన్ కార్సే ను ఎంపిక చేసింది. అంతేకాకుండా, 12వ ఆటగాడిగా జామీ స్మిత్‌ను జట్టులో చేర్చినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
వివరాలు
కార్సే ఇప్పటివరకు భారత్‌తో ఆడలేదు
కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గస్ అట్కిన్సన్ విఫలం అయ్యాడు. అతడు రెండు ఓవర్లలో 38 పరుగులు ఇచ్చాడు. దీంతో భారత్ సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది.
బ్యాటింగ్‌లో కూడా 13 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేయడంతో , ఇంగ్లాండ్ అతనిపై చర్య తీసుకుంది.
కార్సే ఇంగ్లాండ్ తరుపున ఇప్పటి వరకు 4 టీ20 మ్యాచులు ఆడాడు. 15.33 సగటుతో 6 వికెట్లు పడగొట్టాడు.
అతని ఐకానిక్ సగటు 7.66. అయితే,కార్సే ఇప్పటివరకు భారత్‌తో ఆడలేదు. రెండో టీ20 మ్యాచ్‌లో అతడి టీమిండియాతో తొలిసారి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.
మొదటి టీ20 మ్యాచ్ విషయానికి వస్తే, ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి, 20 ఓవర్లలో 132 పరుగులకి ఆలౌటైంది.
వివరాలు
భారత్‌తో రెండో టీ20కి ఇంగ్లాండ్ జట్టు ఇదే..
ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (68) ఒక్కడే రాణించగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీశాడు.అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌లు రెండు వికెట్లు తీశారు.
అనంతరం,భారత్ స్వల్ప లక్ష్యాన్ని 12.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఈ తరుణంలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79 పరుగులు)అద్భుతంగా రాణించి, సంజూ శాంసన్ (26) కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు.
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్,లియామ్ లివింగ్‌స్టోన్,జాకబ్ బెథెల్,జామీ ఓవర్టన్,బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇంగ్లండ్ క్రికెట్ చేసిన ట్వీట్
🚨 Team news for tomorrow's second T20I v India
— England Cricket (@englandcricket) January 24, 2025
🔁 Brydon Carse comes in for Gus Atkinson
🆕 Jamie Smith has also been added to the 12 player squad pic.twitter.com/Fr4Hju00qs