
ODI World Cup: 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లండ్ జట్టు నిష్క్రమణ.. కారణమిదే?
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు వన్డే క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యం చూపించిన ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు సంక్షోభంలో పడింది. 2019లో వన్డే ప్రపంచకప్ విజయం సాధించి చరిత్ర రాసుకున్న ఇంగ్లండ్, 2027లో జరగబోయే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత పొందే అవకాశాన్ని కోల్పోనిష్టంలో ఉంది. దీనికి ప్రధాన కారణం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జట్టు తక్కువ స్థానం. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఆ తర్వాత కూడా వన్డే ఫార్మాట్‌లో ప్రామాణిక ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ఫలితంగా, ఐసీసీ వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో జట్టు ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 2027 ప్రపంచకప్‌లో ఆతిథ్య హోదా కలిగిన దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆటోమేటిక్‌గా అర్హత పొందతాయి.
Details
వన్డే ర్యాంకింగ్ పడిపోవడమే కారణం
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న జట్లకే నేరుగా క్వాలిఫికేషన్ దొరుకుతుంది. ఇంగ్లండ్ ఎనిమిదో స్థానంలో ఉండడం వలన, ఆతిథ్య దేశాలను దృష్టిలో ఉంచితే, జట్టు తొమ్మిదో స్థానానికి పడిపోతుంది. ఫలితంగా, నేరుగా ప్రపంచకప్‌కు అర్హత పొందడం కష్టమవుతుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు టెస్టు, టీ20 ఫార్మాట్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాదిలో కేవలం మూడు వన్డే మ్యాచులు గెలిచిన ఇంగ్లండ్, పేలవమైన గెలుపు-ఓటమి నిష్పత్తిని నమోదు చేసింది. ఈ పరిస్థితి కొనసాగితే, జట్టుకు 2027 ప్రపంచకప్ కోసం క్వాలిఫయర్స్ ఆడాల్సి వస్తుంది. ప్రపంచ క్రికెట్‌లో ఒకప్పుడు నెంబర్ వన్ జట్టుగా ప్రసిద్ధి పొందిన ఇంగ్లండ్, ఈ సమస్యతో అభిమానులను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది.