Page Loader
IND vs ENG ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌.. తొలి వన్డేకు విరాట్ కోహ్లీ దూరం..!

IND vs ENG ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌.. తొలి వన్డేకు విరాట్ కోహ్లీ దూరం..!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2025
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య నాగ్‌పూర్‌లో తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న టీమిండియా, అదే ఉత్సాహంతో వన్డేల్లోనూ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంగ్లాండ్‌ మాత్రం కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ ముందు వన్డేల్లో మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. టాస్‌ సందర్భంగా భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ, విరాట్‌ కోహ్లీ ఈ మ్యాచ్‌ ఆడడం లేదని ప్రకటించాడు. మోకాలి గాయం కారణంగా అతను ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు వివరించాడు.

వివరాలు 

మహ్మద్‌ షమీకి వన్డే జట్టులో చోటు 

ఈ మ్యాచ్‌లో తొలిసారిగా యశస్వి జైస్వాల్‌, హర్షిత్‌ రాణా భారత జట్టుకు వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు. ఈ సందర్భంగా ఇద్దరికీ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అధికారిక క్యాప్‌ను అందజేసింది. ఇంతకుముందు, హర్షిత్‌ రాణా ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గో టీ20 మ్యాచ్‌లో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా అరంగేట్రం చేసి ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శన వల్ల వన్డే జట్టులో కూడా అతనికి అవకాశం దక్కింది. 2023 వన్డే ప్రపంచకప్‌ అనంతరం తొలిసారి భారత ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ వన్డేల్లో ఆడనున్నారు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ తర్వాత గాయపడిన షమీ, దీర్ఘకాలం క్రికెట్‌కు దూరమయ్యాడు.

వివరాలు 

తుది జట్లు ఇవే..

ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు, నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న వన్డేలో షమిని తుదిజట్టులో ఎంపిక చేసిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌, అతను చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు బంతితో ప్రభావం చూపాలని ఆశిస్తోంది. ఇంగ్లాండ్ జట్టు : బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్),జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్. భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్),యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్,శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా,అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్),రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.