కోచ్ లేకపోవడం కూడా కొన్నిసార్లు ప్రయోజనం చేకూరుతుంది: స్మృతి మంధాన
హెడ్ కోచ్ లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ప్రయోజనం చేకూరుతుందని ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెప్పారు. ఒక్కరే కాకుండా కోచింగ్ స్టాఫ్ లోని వేర్వేరు వ్యక్తులు ఇచ్చే సలహాలు మంచి ఫలితాలను ఇస్తాయని పేర్కొంది. అయితే ఇప్పటివరకూ టీమిండియా ఉమెన్స్ జట్టుకు హెడ్ కోచ్ లేరు. గతేడాది డిసెంబర్‌లో రమేష్ పవార్ ను బీసీసీఐ తప్పించింది. ఇటువంటి తరుణంలో హెడ్ కోచ్ విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మంధాన. హెడ్ కోచ్ లేకుండానే ఉమెన్స్ జట్టు టీ20 వరల్డ్ కప్ ఆడిన విషయం తెలిసిందే.
వుమెన్స్ టీమ్ హెడ్ కోచ్ రేసులో అమోల్ మజుందార్?
చాలా కాలంగా బీసీసీఐ ఓ కోచ్ కోసం చూస్తోందని, త్వరలోనే కోచ్ వస్తారని తాను ఆశిస్తున్నానని, అయితే ప్లేయర్స్ కు ఇది పెద్ద విషయం కాదని స్మృతి మంధాన పేర్కొన్నారు. తమకు సాధ్యమైనంత వరకూ అత్యుత్తమ క్రికెట్ ఆడుతామని, ప్రస్తుతమున్న కోచింగ్ స్టాఫ్ చాలా సాయం చేస్తున్నారని, కొన్నిసార్లు ఇది కూడా కలిసి వస్తుందని ఆమె పేర్కొంది. ప్రస్తుతం వుమెన్స్ టీమ్ హెడ్ కోచ్ రేసులో మాజీ క్రికెటర్ అమోల్ మజుందార్ ముందు వరుసలో ఉన్నాడు. టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. ఈ టూరులో అశించన మేర ఆమె రాణించలేదు. మూడు టీ20లు కలిపి 52 రన్స్ మాత్రమే చేసింది. వన్డేల్లో వరుసగా 11, 36 పరుగులు చేసి నిరాశపరిచింది.