
Tamim Iqbal: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ కు గుండెపోటు.. పరిస్థితి విషమం
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ క్రికెట్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో, అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజీషియన్ దేబాశీష్ చౌధురి తెలిపారు.
ఢాకా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్,షైన్‌పుకుర్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మహమ్మదన్ క్లబ్ కెప్టెన్‌గా ఉన్న తమీమ్,టాస్ కోసం మైదానంలోకి వచ్చిన సమయంలో ఛాతీలో నొప్పితో బాధపడ్డాడు
దీంతో, స్థానికంగా ఉన్న ఫజిలాతున్నెసా ఆసుపత్రికి తరలించగా, స్వల్ప గుండెపోటుగా నిర్ధారించారు.
వివరాలు
2025 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
అతడిని ఢాకాకు తరలించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేసినప్పటికీ,హెలిప్యాడ్‌కు వెళ్తుండగా మరోసారి గుండెపోటు రావడంతో తిరిగి అదే ఆసుపత్రికి తీసుకువచ్చారు.
ప్రస్తుతం వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. తమీమ్ ఆరోగ్యంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఆరా తీశారు.
తమీమ్ ఇక్బాల్ 1989 మార్చి 20న జన్మించారు.2020 నుండి 2023 వరకు వన్డే మ్యాచ్‌లలో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా సేవలందించారు.
2023లో జాతీయ జట్టుకు చివరిసారిగా ప్రాతినిధ్యం వహించిన ఆయన,70 టెస్టులు,78 టీ20లు ఆడారు.
243 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడి 8,357 పరుగులు చేశారు.
2025 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆయన,ఆ తర్వాత లీగ్ మ్యాచ్‌లు ఆడుతూ, అప్పుడప్పుడు కామెంట్రీ కూడా చేస్తున్నారు.తమీమ్‌కు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.