Page Loader
CSK Team: అనుభవం vs యువత.. సీఎస్‌కే జట్టు ఎన్నికలో ధోనీ జడ్జ్‌మెంట్ హైలైట్

CSK Team: అనుభవం vs యువత.. సీఎస్‌కే జట్టు ఎన్నికలో ధోనీ జడ్జ్‌మెంట్ హైలైట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 26, 2024
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అనుభవానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ వేలంలో సీనియర్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడంపై దృష్టి సారించింది. భారీ ధరలు ఉన్న ఆటగాళ్ల జోలికి పోకుండా, తక్కువ ఖర్చులోనే బలమైన జట్టును రూపొందించింది. సీఎస్‌కే మేనేజ్మెంట్, ఎంఎస్ ధోని సూచనలతో అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వేలానికి ముందు సీఎస్‌కే రుతురాజ్ గైక్వాడ్‌, మతీష పతీరణ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీలను రిటైన్‌ చేసింది. ఈ అగ్రశ్రేణి ఆటగాళ్ల ఆధారంగా జట్టుకు అనుభవం, స్ఫూర్తి అందించడానికి ముందుగానే పునాది వేసింది.

Details

రవిచంద్రన్ అశ్విన్ కు రూ.9.75 కోట్లు

వేలంలో సీనియర్ టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను రూ.9.75 కోట్లు చెల్లించి తిరిగి జట్టులోకి తీసుకుంది. డేవాన్ కాన్వే రూ.6.25 కోట్లకు, రచిన్ రవీంద్ర రూ.4 కోట్లు, సామ్ కరన్‌కు రూ.2.40 కోట్లు, అఫ్గాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్‌ కోసం రూ.10 కోట్లు వెచ్చించింది. దేశీయ ఆటగాళ్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠిలను తీసుకొని జట్టుకు బలాన్ని అందించింది. మొత్తం 20 ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేసిన సీఎస్‌కే, 25 మందితో పూర్తి జట్టును సిద్ధం చేసింది.

Details

వేలంలో సీఎస్కే కొనుగోలు చేసిన ప్లేయర్లు జాబితా ఇదే 

1. డెవాన్ కాన్వే - రూ. 6.25 కోట్లు 2. రాహుల్ త్రిపాఠి - రూ. 3.4 కోట్లు 3. రచిన్ రవీంద్ర - రూ. 4 కోట్లు 4. రవిచంద్రన్ అశ్విన్ - రూ. 9.75 కోట్లు 5. ఖలీల్ అహ్మద్ - రూ. 4.80 కోట్లు 6. నూర్ అహ్మద్ - రూ. 10 కోట్లు 7. విజయ్ శంకర్ - రూ. 1.2 కోట్లు 8. సామ్ కరన్ - రూ. 2.4 కోట్లు 9. షేక్ రషీద్ - రూ. 30 లక్షలు 10. అన్షుల్ కాంబోజ్ - రూ. 3.4 కోట్లు

Details

వేలంలో సీఎస్కే కొనుగోలు చేసిన ప్లేయర్లు జాబితా ఇదే (2)

11. ముఖేష్ చౌదరి - రూ. 30 లక్షలు 12. దీపక్ హుడా - రూ. 1.7 కోట్లు 13. గుర్జప్నీత్ సింగ్ - రూ. 2.2 కోట్లు 14. నాథన్ ఎల్లిస్ - రూ. 2 కోట్లు 15. జామీ ఓవర్టన్ - రూ. 1.5 కోట్లు 16. కమలేష్ నాగరకోటి - రూ. 30 లక్షలు 17. రామకృష్ణ ఘోష్ - రూ. 30 లక్షలు 18. శ్రేయాస్ గోపాల్ - రూ. 30 లక్షలు 19. వంశ్ బేడీ - రూ. 55 లక్షలు 20. ఆండ్రీ సిద్దార్థ్ - రూ. 30 లక్షలు

Details

రిటైన్ లిస్ట్ జాబితా

1. రుతురాజ్ గైక్వాడ్‌ 2.మతీష పతీరణ 3.శివమ్ దూబే 4.రవీంద్ర జడేజా 5.ఎంఎస్ ధోనీ