Page Loader
Virat Kohli: మాంసంపై కోహ్లీ అబద్దం చెప్పాడంటూ ఫ్యాన్స్ షాక్.. అసలు నిజం ఏమిటంటే?
మాంసంపై కోహ్లీ అబద్దం చెప్పాడంటూ ఫ్యాన్స్ షాక్.. అసలు నిజం ఏమిటంటే?

Virat Kohli: మాంసంపై కోహ్లీ అబద్దం చెప్పాడంటూ ఫ్యాన్స్ షాక్.. అసలు నిజం ఏమిటంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 13, 2023
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఫిట్‌నెస్ పై ఎంత శ్రద్ధ చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శరీరం ఫిట్‌నెస్‌కు మాంసాహారం అడ్డుకాకూడదని కోహ్లీ శాఖాహారిగా మారిపోయాడు. ఈ విషయంలో కోహ్లీ అబద్ధం చెప్పారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కోహ్లీ ఇన్ స్టా స్టోరీలో 'మాక్ చికెన్ టిక్కా'ను పోస్ట్ చేయడంలో శాఖహారి అయిన కోహ్లీ చికెన్ తినడం ఏంటని అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే ఇది మాంసాహారం కాదని, మొక్కల ఆధారితంగా వచ్చిన సోయా నుంచి ఈ వంటకాన్ని చేసినట్లు తెలిసింది. అచ్చం చూడటానికి మాంసాహారంలా కనిపించినా ఇదొక పూర్తి శాఖాహార వంటకం. రుచి కూడా చికెన్ లాగా ఉంటుంది.

Details

టెస్టు సిరీస్ కు ఎంపికైన విరాట్ కోహ్లీ

సాధారణ చికెన్ కు, మాక్ చికెన్ టిక్కా తేడా గుర్తించడంలో ఫ్యాన్స్ విఫలమయ్యారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూరులో భాగంగా టీ20లు, వన్డేల నుంచి కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడు. డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా జరిగే తొలి టెస్టు సిరీస్ కి కోహ్లీ ఎంపికయ్యాడు. ఇక వన్డే ప్రపంచ కప్ లో 765 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కు కోహ్లీ ఎంపికైన విషయం తెలిసిందే.