Page Loader
IPL 2025: విరాట్ కోహ్లీ గాయంతో అభిమానుల్లో ఆందోళన.. ఆర్‌సీబీ కోచ్ క్లారిటీ!
విరాట్ కోహ్లీ గాయంతో అభిమానుల్లో ఆందోళన.. ఆర్‌సీబీ కోచ్ క్లారిటీ!

IPL 2025: విరాట్ కోహ్లీ గాయంతో అభిమానుల్లో ఆందోళన.. ఆర్‌సీబీ కోచ్ క్లారిటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2025
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా, అతని బొటన వేలికి తీవ్ర గాయమైంది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో సాయి సుదర్శన్ డీప్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడగా, బౌండరీ లైన్ వద్ద కోహ్లీ బంతిని ఆపేందుకు ప్రయత్నించాడు. క్యాచ్ అందుకునేందుకు ముందుకు వెళ్ళిన అతను, బంతి ముందే పడటంతో అడ్డుకోలేకపోయాడు. దీంతో బంతి అతని బొటన వేలిని బలంగా తాకింది. గాయం తక్షణమే గుర్తించిన ఫిజియోలు, కోహ్లీకి ప్రథమ చికిత్స అందించారు. అయినా ఫీల్డింగ్ కొనసాగించిన కోహ్లీ అసౌకర్యంగా కనిపించాడు.

Details

కోహ్లీ బాగానే ఉన్నాడు

పదేపదే తన బొటన వేలిని రుద్దుకుంటూ కనిపించడంతో, ఆర్‌సీబీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే మ్యాచ్ అనంతరం కోహ్లీ గాయంపై ఆర్‌సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్పందిస్తూ, "కోహ్లీ గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అతను బాగానే ఉన్నాడని స్పష్టం చేశాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Details

ఆర్‌సీబీకి ఘోర పరాజయం

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో రాణించగా, జితేష్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్), టీమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. అనంతరం గుజరాత్ టైటాన్స్ 17.2 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసి సునాయస విజయాన్ని సాధించింది. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్‌వుడ్ తలో వికెట్ తీశారు.