IPL 2025: ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే..!
ఈ వార్తాకథనం ఏంటి
మార్చి 22న ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభం కానుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాను పరిశీలిద్దాం.
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ దూకుడు క్రికెట్ అభిమానులకు తెలియని విషయం కాదు. 2013లో ఆర్సీబీ తరఫున అతను ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ బాదాడు.పూణే వారియర్స్‌పై కేవలం 30 బంతుల్లోనే ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
భారత మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా చేసేవాడు. 2010 ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ తరఫున 37 బంతుల్లోనే శతకం బాదాడు.
వివరాలు
39 బంతుల్లోనే సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్
కింగ్స్ XI పంజాబ్ తరఫున ఆడిన డేవిడ్ మిల్లర్ సైతం వేగవంతమైన సెంచరీ సాధించాడు. 2013 సీజన్‌లో ఆర్సీబీపై 38బంతుల్లోనే మిల్లర్ తన శతకం పూర్తి చేశాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు ట్రావిస్ హెడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీపై కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరిగింది.
గతేడాది (2024) గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ ఆటగాడు విల్ జాక్స్ సూపర్ సెంచరీ చేశాడు. అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను 41బంతుల్లో శతకం బాదాడు.
ఐపీఎల్ తొలి సీజన్ (2008) నుంచే సూపర్ సెంచరీలు నమోదయ్యాయి. డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడమ్ గిల్‌క్రిస్ట్ ముంబయి ఇండియన్స్‌పై 42 బంతుల్లోనే శతకం చేశాడు.
వివరాలు
43బంతుల్లోనే శతకం సాధించిన డేవిడ్ వార్నర్
2016 ఐపీఎల్‌లో ఆర్సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ గుజరాత్ లయన్స్‌పై అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించాడు.కేవలం 43బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌కు చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలిచింది.
2017ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 43బంతుల్లోనే శతకం సాధించి జట్టుకు కీలక విజయాన్ని అందించాడు.
శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య తన విపరీతమైన హిట్టింగ్ కోసం ప్రఖ్యాతి పొందాడు.2008 ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున చెన్నై సూపర్ కింగ్స్‌పై 45 బంతుల్లోనే శతకం సాధించాడు.
పంజాబ్ కింగ్స్‌కు చెందిన ఇద్దరు అగ్రశ్రేణి బ్యాటర్లు మయాంక్ అగర్వాల్,జానీ బెయిర్‌స్టో ఈ జాబితాలో స్థానం సంపాదించారు.మయాంక్ 2020లో రాజస్థాన్‌పై,బెయిర్‌స్టో 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 45బంతుల్లో సెంచరీ నమోదు చేశారు.