LOADING...
IND vs NZ: న్యూజిలాండ్‌తో ఫైనల్ సమరం.. టాస్ ఓడిన టీమిండియా 
న్యూజిలాండ్‌తో ఫైనల్ సమరం.. టాస్ గెలిచిన టీమిండియా

IND vs NZ: న్యూజిలాండ్‌తో ఫైనల్ సమరం.. టాస్ ఓడిన టీమిండియా 

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 09, 2025
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇవాళ టీమిండియా-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియం వేదికగా ఈ మ్యాచులో మొదట న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచింది. ఈ క్రమంలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఒక మార్పు చేసింది. ఇక రోహిత్ శర్మ నేతృత్వంలో 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది

Details

ఇరు జట్లలోని ప్లేయర్లు వీరే

భారత్ జట్టు ఇదే రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి న్యూజిలాండ్ జట్టు విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(w), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్