Pakistan team: ఆసీస్‌తో తొలి టెస్టు.. మహ్మద్ రిజ్వాన్ స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్
ఆస్ట్రేలియాతో ఇవాళ నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్ కోసం పాకిస్థాన్ తుది జట్టును బుధవారం ప్రకటించింది. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు టెస్టు అరంగేట్రం చేయనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఆల్ రౌండర్ అమీర్ జమాల్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ తమ తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఆల్ రౌండర్ ఫహీమ్ అష్రాఫ్ ఏడాది తర్వాత తిరిగి పాక్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక వికెట్ కీపర్ గా మహ్మద్ రిజ్వాన్ స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ ను ఎంపిక చేసింది. ఈ నిర్ణయంపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. ఇటీవల రిజ్వాన్ పాకిస్థాన్ క్రికెట్ జట్టులో నిలకడగా రాణిస్తున్నాడు.
మహ్మద్ రిజ్వాన్ అభిమానుల అసంతృప్తి
పాకిస్తాన్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఆడినప్పుడు అతను అత్యుత్తమ ప్రదర్శన చూపాడు. దీంతో సోషల్ మీడియాలో రిజ్వాన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచులో ఓపెనర్లుగా ఇమామ్ ఉల్ హాక్, అబ్దుల్లా షఫీక్ ఆడనుండగా, వన్ డౌన్‌లో నయా కెప్టెన్ షాన్ మసూద్, తర్వాత బాబార్ ఆజమ్ బరిలోకి దిగనున్నారు. తొలి టెస్టు కోసం పాకిస్థాన్ జట్టు షాన్ మసూద్ (కెప్టెన్), ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్-కీపర్), సల్మాన్ అలీ అఘా, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ షా ఆఫ్రిది, అమీర్ జమాల్ మరియు ఖుర్రం షాజాద్.