Page Loader
IND vs AUS: కంగారూల‌నూ కంగారెత్తించిన ప‌రుగుల వీరులు వీరే..!
కంగారూల‌నూ కంగారెత్తించిన ప‌రుగుల వీరులు వీరే..!

IND vs AUS: కంగారూల‌నూ కంగారెత్తించిన ప‌రుగుల వీరులు వీరే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2024
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎప్పుడైనా, ఎక్కడైనా ఆస్ట్రేలియా జట్టు ఆట సాధారణంగా ఉండ‌దు.అదీ సొంత‌గ‌డ్డ‌పైన సిరీస్ అంటే ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ల‌ను వ‌ణికించ‌డం ఆజ‌ట్టుకు మ‌హా స‌ర‌దా కానీ, అగ్ర బౌలింగ్ లైన్‌-అప్‌ను ఎదుర్కొని, ఆ జట్టుకు సవాలుగా నిలిచిన బ్యాట్స్‌మెన్ చాలా తక్కువ మంది మాత్రమే. ఈ సవాలు ఎదుర్కొన్న భారత క్రికెటర్లలో ప‌ట్టు చెలాయించిన ఐదుగురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

వివరాలు 

సచిన్ టెండూల్క‌ర్ 

సచిన్ టెండూల్కర్ భారత క్రికెటర్స్'లో అగ్రస్థానంలో ఉన్న ఒక అద్భుతమైన ఆటగాడు. ఆయన ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌నల్లో అనేక అద్భుత ఇన్నింగ్స్‌ల‌తో పేరు ప్రఖ్యాతుల‌ను సంపాదించుకున్నాడు. ప్రత్యేకంగా ఆస్ట్రేలియాలో అద్భుత‌మైన రికార్డు సాధించిన తొలి భారత క్రికెట‌ర్‌గా సచిన్ నిలిచాడు. 38 ఇన్నింగ్స్‌లలో 1,809 ప‌రుగులు సాధించాడు, ఇందులో 6 సెంచ‌రీలు, 7 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత‌డి అత్య‌ధిక స్కోర్ 241 నాటౌట్. విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ,సచిన్ త‌ర్వాత ఆస్ట్రేలియాపై అత్య‌ధిక ప‌రుగుల‌ను సాధించిన క్రికెట‌ర్‌గా గుర్తించ‌బ‌డుతున్నారు. ముఖ్యంగా, ఆసీస్ బౌల‌ర్ల ద‌శ‌నికత‌ను ఎదుర్కొనడానికి విరాట్ ఎప్పుడూ రెడీ. 25 ఇన్నింగ్స్‌లలో 1,352 ప‌రుగులు సాధించ‌గా,వాటిలో 6 సెంచ‌రీలు, 4 అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి. అత‌డి అత్య‌ధిక స్కోర్ 169.

వివరాలు 

వీవీఎస్ లక్ష్మణ్ 

లక్ష్మణ్, 'వెరీ వెరీ స్పెష‌ల్' అనే పేరు తెచ్చుకున్న తెలుగు క్రికెట‌ర్, ఆస్ట్రేలియాలో అద్భుత‌మైన బ్యాటింగ్‌తో ప్రసిద్ధి చెందాడు. ఆయ‌న ద్ర‌విడ్‌తో కలిసి కీల‌క ఇన్నింగ్స్‌ల‌ను ఆడుతూ ఆస్ట్రేలియాను అల‌రిస్తూ 1,236 ప‌రుగులు సాధించాడు. అత‌డి అత్య‌ధిక స్కోర్ 178. రాహుల్ ద్రావిడ్ భార‌త జ‌ట్టులో 'ది వాల్'గా ప‌రిచ‌య‌మ‌యిన రాహుల్ ద్రావిడ్‌ ఆస్ట్రేలియాతో జరిగిన ప‌ర్య‌ట‌నల్లో చాలా శక్తివంతంగా ఆడాడు. 2000లో ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌ను ఎదుర్కొని 1,143 ప‌రుగులు సాధించాడు. ఒక సెంచ‌రీ, 6 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత‌డి అత్య‌ధిక స్కోర్ 233.

వివరాలు 

ఛ‌తేశ్వర్ పూజారా 

రాహుల్ ద్ర‌విడ్‌కు అనుగుణంగా, పూజారా ఆస్ట్రేలియాలో కీలకమైన భాగస్వామ్యాలు నిర్మించాడు. 2018, 2020లో భారత్ విజయాల్లో అతని పాత్ర చాలా గొప్పది. అత‌డి రికార్డు 948 ప‌రుగులు, 2 సెంచ‌రీలు, 4 అర్ధ సెంచ‌రీలు సాధించిన వాటిలో, అత‌డి అత్య‌ధిక స్కోర్ 195. ఈ ఐదు క్రికెటర్లు ఆస్ట్రేలియాలో భారత జట్టుకు గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు. వారి ఆట‌తీరు, అత్య‌ద్భుత‌మైన బ్యాటింగ్, అవి ప్రతీ భారతీయ క్రికెట్ ఫ్యాన్‌కు స్మ‌ర‌ణీయంగా మిగిలిపోయాయి.