Rohit Sharma: ' కొంతకాలం నేనే సారథి'.. బీసీసీఐ సమావేశంలో రోహిత్ శర్మ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను కోల్పోవడంపై బీసీసీఐ సమీక్ష నిర్వహించింది.
ఈ సమీక్షకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ స్పష్టంగా సూచించింది.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి అగ్ర క్రికెటర్లు జాతీయ జట్టులోకి ఎంపిక కావాలంటే ముందుగా దేశవాళీ క్రికెట్‌లో ఆడాలనే నిబంధనను కఠినతరం చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
మినహాయింపు ఇవ్వాలంటే కోచ్, చీఫ్ సెలక్టర్ అంగీకారం అవసరం.
భవిష్యత్తులో టెస్టు, వన్డే సారథి ఎంపికపై కూడా తీవ్రంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Details
బుమ్రా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ ఆందోళన
రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోవాలని ఊహించినా, ఆయన ఈ సమావేశంలో అలా ఏమీ లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.
తానే కొంతకాలం ఇంకా సారథిగా కొనసాగుతానని రోహిత్ చెప్పారు. బుమ్రాకు జట్టు పగ్గాలు అప్పగించే అంశంపై కూడా చర్చ జరిగింది.
బుమ్రా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో 150 ఓవర్లు వేసిన బుమ్రా వెన్ను నొప్పితో సిడ్నీ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు.
ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతని ఆడే పరిస్థితి పై అనుమానాలేర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో బీసీసీఐ రోహిత్ శర్మని కొనసాగించి, బుమ్రా ఫిట్‌నెస్ సాధించిన తర్వాత కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.