Rohit Sharma: ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం.. రోహిత్‌కు వీరాభిమాని లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ఫామ్ కోసం కష్టపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ 15 ఏళ్ల అభిమాని రాసిన భావోద్వేగభరితమైన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ లేఖ క్రికెట్ అభిమానుల మనసులను ఆకర్షిస్తోంది. టెస్టు, వన్డేల్లో టీమిండియా సారథిగా ఉన్న రోహిత్ శర్మ, ఇటీవల జరిగిన బోర్డర్-గావస్కర్ టోర్నీలో నిరాశాజనక ప్రదర్శన కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
రోహిత్ శర్మ ఆటతీరుపై విమర్శలు రావడంతో, అతను క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని కొందరు సూచిస్తున్నారు.
తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు రంజీ మ్యాచ్‌లో బరిలోకి దిగినా అక్కడ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
Details
ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ఈ నేపథ్యంలో, రోహిత్ శర్మపై ప్రేమ కలిగిన ఓ 15 ఏళ్ల బాలుడు రాసిన లేఖ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆ లేఖలో బాలుడు రోహిత్‌పై తన అభిమానాన్ని అద్భుతంగా వ్యక్తం చేశాడు.
తన ఫేవరెట్ క్రికెటర్, గ్రేటెస్ట్ బ్యాటర్ ఆఫ్ ఆల్ టైమ్! రోహిత్ ఆడే ప్రతి మ్యాచ్ తనకు ఎంతో ప్రత్యేకమన్నారు.
మీ అభిమానులు మీ పట్ల ఎంత ప్రేమతో ఉన్నారో ఈ లేఖ ద్వారా తెలియజేయాలనుకున్నానని, ఫామ్ తాత్కాలికమే అని, కానీ క్లాస్ శాశ్వతమని చెప్పారు.
ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు.
Details
మ్యాచ్ కోసం మ్యాథ్స్ క్లాస్ ఎగ్గొట్టి వచ్చా
రంజీ మ్యాచ్‌లో మీరు కొట్టిన మూడు సిక్సర్లు అద్భుతమైనవని, మీ మ్యాచ్ చూడటం కోసం తాను మ్యాథ్స్ క్లాస్‌ను కూడా ఎగ్గొట్టి వచ్చానని అభిమాని వెల్లడించారు.
రోహిత్ శర్మ మైదానంలో ఓపెనింగ్ చేయకపోతే టీవీ ఆన్ చేయడం కూడా తనకు ఇష్టం ఉండదన్నారు. ఈ 15 ఏళ్ల బాలుడు. స్పోర్ట్స్ అనలిస్ట్ కావాలన్నది తన కల అని చెప్పారు.
ఈ లేఖ క్రికెట్ అభిమానుల గుండెలను తాకింది. రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లపై అభిమానుల ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో ఈ లేఖ ద్వారా బయటపడింది.