సెంచరీతో విజృంభించిన వీవీఎస్ లక్ష్మణ్ కొడుకు
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా క్రికెట్లో వీవీఎస్ లక్ష్మణ్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో లక్ష్మణ్ తనదైన ముద్ర వేసుకున్నారు.
ఇప్పుడు అతని కుమారుడు సర్వజిత్ వీవీఎస్ చిన్న వయస్సులోనే క్రికెట్‌లో రాణిస్తూ అందరినీ అశ్చర్యపరుస్తున్నాడు.
ఇటీవల సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ 2023లో ముంబై జట్టు తరుపున కొన్ని మ్యాచులు ఆడిన విషయం తెలిసిందే. తాజాగా లక్ష్మణ్ వారసుడు సర్వజిత్ సికింద్రాబాద్ నవాబ్స్ జట్టు తరుపున ఆడాడు.
మొదటి మ్యాచులో 30 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రెండో మ్యాచులో సెంచరీతో చెలరేగిపోయాడు. ఫ్యూచర్ స్టార్ తో జరిగిన మ్యాచులో 12 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 209 బంతుల్లో 104 పరుగులు చేశాడు.
Details
సంతోషం వ్యక్తం చేసిన లక్ష్మణ్
రెండో మ్యాచులో అద్భుత ఇన్నింగ్స్ అడిన సర్వజిత్ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అనంతరం సెంచరీ చేయడంపై సర్వజిత్ మాట్లాడారు.
ఇది తనకు రెండో మ్యాచ్ అని, తొలి సెంచరీ కలకాలం గుర్తిండిపోతుందని, భవిష్యత్తులో మరింత కష్టపడి పరుగులు సాధిస్తానని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు.
దీంతో సర్వజిత్ రెండో మ్యాచులోనే సెంచరీ కొట్టడంపై వీవీఎస్ లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశారు. రెండో మ్యాచులోనే సెంచరీ చేయడం అతనికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని, అతని నిబద్ధత అతనిని మంచి స్థానంలో నిలుపుతుందని అశిస్తున్నానని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, భవిష్యతులో సర్వజిత్ టీమిండియాకు ఎంపిక అవుతాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.