Page Loader
ICC: టీ20 ఆఫ్ ది ఇయర్ జట్టులో నలుగురు భారత క్రికెటర్లు, కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక 
టీ20 ఆఫ్ ది ఇయర్ జట్టులో నలుగురు భారత క్రికెటర్లు, కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక

ICC: టీ20 ఆఫ్ ది ఇయర్ జట్టులో నలుగురు భారత క్రికెటర్లు, కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2024 టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్‌ను శనివారం విడుదల చేసింది. ఈ జట్టుకు వరల్డ్‌కప్ గెలుపు సారథి రోహిత్ శర్మనే కెప్టెన్‌గా నియమించారు. టీమిండియాకు చెందిన నలుగురు ఆటగాళ్లు ఈ జట్టులో చోటు సంపాదించారు. రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ జట్టులో ఉన్నారు. 2024 టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్‌ సభ్యుల జాబితా రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ అజామ్, నికోలస్ పూరన్, సికిందర్ రజా, హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, వానిందు హసరంగ, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్