
IPL: వంద దాటిన సెంచరీలు: ఐపీఎల్‌లో శతకాలు బాదిన లెజెండరీ ఆటగాళ్లు వీరే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు.. లలిత్ మోడీ. ఈ మెగా లీగ్ సృష్టికర్త ఆయనే. తొలి మూడు సంవత్సరాల పాటు చైర్మన్‌గా వ్యవహరించిన ఆయన,క్యాష్ రిచ్ లీగ్‌ను రూపొందించి బీసీసీఐ ఖజానాను సంపదతో నింపారు. క్రికెటర్ల వేతనాలను కోట్ల రూపాయలకు పెంచి, వారికి భారీ ఆర్థిక ప్రయోజనాలు కల్పించారు. ప్రస్తుతానికి ఆయన విదేశాల్లో ఉన్నప్పటికీ, ఆయన స్థాపించిన ఈ లీగ్ మాత్రం ఇప్పటికీ అభిమానులకు వినోదాన్ని అందిస్తూ ఆకట్టుకుంటోంది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ తొలి సీజన్ నుంచి 2024 వరకూ ప్రతి ఏడాది దాని క్రేజ్ ను పెంచుకుంటూనే ఉంది.
వివరాలు
వంద పరుగుల మైలురాయిని చేరుకోవడం అరుదైన ఘనత
ఎందరో ఆటగాళ్లు వస్తున్నారు.. పోతున్నారు.అయితే ఈ టోర్నీలో చర్చించాల్సిన ముఖ్యమైన అంశాల్లో ఒకటి.. శతకాల గురించి. ప్రస్తుతం ఆటలో వేగం పెరగడం వల్ల బ్యాటర్లు ఎక్కువగా సెంచరీలు సాధిస్తున్నారు. కానీ, గతంలో వంద పరుగుల మైలురాయిని చేరుకోవడం అంటే నిజంగా అరుదైన ఘనత. ముఖ్యంగా 20 ఓవర్ల ఫార్మాట్‌లో శతకం చేయడం అంటే అదొక ప్రత్యేక ఘనతగా భావించేవారు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకు శతకాల సంఖ్య వంద మార్క్‌ను దాటింది. తొలిసారి ఐపీఎల్‌లో సెంచరీ చేసిన ఆటగాడు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఓవర్సీస్ ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్, కాగా..గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ తాజా సీజన్‌లో చివరి సెంచరీ చేసిన భారత యువ బ్యాటర్‌గా నిలిచాడు.
వివరాలు
ఐపీఎల్‌లో శతకాలు బాదిన ఆటగాళ్లు
1. బ్రెండన్ మెకల్లమ్(KKR): 158 నాటౌట్ (RCBపై, 2008) 2. మైక్ హస్సీ: 116 (2008) 3. ఆండ్రూ సైమండ్స్: 117 నాటౌట్ (2008) 4. ఆడమ్ గిల్‌క్రిస్ట్: 109 నాటౌట్ (2008) 5. సనత్ జయసూర్య: 114 నాటౌట్ (2008) 6. షాన్ మార్ష్: 115 (2008) 7. ఏబీ డివిలియర్స్: 105 నాటౌట్ (2009) 8. మనీష్ పాండే: 114 నాటౌట్ (2009) 9. యూసుఫ్ పఠాన్: 100 (2010) 10. డేవిడ్ వార్నర్: 107 నాటౌట్ (2010)
వివరాలు
ఐపీఎల్‌లో శతకాలు బాదిన ఆటగాళ్లు
11. మురళీ విజయ్: 127 (2010) 12. మహేల జయవర్దన: 110 నాటౌట్ (2010) 13. పాల్ వాల్తాటి: 120 నాటౌట్ (2011) 14. సచిన్ టెండూల్కర్: 100 నాటౌట్ (2011) 15. క్రిస్ గేల్: 102 నాటౌట్ (2011) 16. వీరేంద్ర సెహ్వాగ్: 119 (2011) 17. క్రిస్ గేల్: 107 (2011) 18. ఆడమ్ గిల్‌క్రిస్ట్: 106 (2011) 19. అజింక్య రహానే: 103 నాటౌట్ (2012) 20. కెవిన్ పీటర్సన్: 103 నాటౌట్ (2012)
వివరాలు
ఐపీఎల్‌లో శతకాలు బాదిన ఆటగాళ్లు
21. డేవిడ్ వార్నర్: 109 నాటౌట్ (2012) 22. రోహిత్ శర్మ: 109 నాటౌట్ (2012) 23. క్రిస్ గేల్: 128 నాటౌట్ (2012) 24. మురళీ విజయ్: 113 (2012) 25. షేన్ వాట్సన్: 101 (2013) 26. క్రిస్ గేల్: 175 నాటౌట్ (2013) 27. సురేష్ రైనా: 100 నాటౌట్ (2013) 28. డేవిడ్ మిల్లర్: 101 నాటౌట్ (2013) 29. లెండి సిమన్స్: 100 నాటౌట్ (2014) 30. వీరేంద్ర సెహ్వాగ్: 122 (2014)
వివరాలు
ఐపీఎల్‌లో శతకాలు బాదిన ఆటగాళ్లు
31. వృద్ధిమాన్ సాహా: 115 నాటౌట్ (2014) 32. బ్రెండన్ మెకల్లమ్: 100 నాటౌట్, (2015) 33. క్రిస్ గేల్: 117 (2015) 34. ఏబీ డివిలియర్స్: 133 నాటౌట్ (2015) 35. షేన్ వాట్సన్: 104 నాటౌట్ (2015) 36. క్వింటన్ డి కాక్: 108 (2015) 37. విరాట్ కోహ్లీ: 100 నాటౌట్ (2016) 38. స్టీవెన్ స్మిత్: 101 (2016) 39. విరాట్ కోహ్లీ: 108 నాటౌట్ (2016) 40. విరాట్ కోహ్లీ: 109 నాటౌట్ (2016)
వివరాలు
ఐపీఎల్‌లో శతకాలు బాదిన ఆటగాళ్లు
41. ఏబీ డివిలియర్స్: 129 నాటౌట్ (2016) 42. విరాట్ కోహ్లీ: 113 (2016) 43. సంజు శాంసన్: 102 నాటౌట్ (2017) 44. హషీమ్ ఆమ్లా: 104 నాటౌట్ (2017) 45. డేవిడ్ వార్నర్: 126 (2017) 46. బెన్ స్టోక్స్: 103 నాటౌట్ (2017) 47. హషీమ్ ఆమ్లా: 104 (2017) 48. క్రిస్ గేల్: 104 నాటౌట్ (2018) 49. షేన్ వాట్సన్: 106 (2018) 50. రిషబ్ పంత్: 128 నాటౌట్ (2018)
వివరాలు
ఐపీఎల్‌లో శతకాలు బాదిన ఆటగాళ్లు
51. అంబటి రాయుడు: 100 నాటౌట్ (2018) 52. షేన్ వాట్సన్: 117 నాటౌట్ (2018) 53. సంజు శాంసన్: 102 నాటౌట్ (2019) 54. జానీ బెయిర్‌స్టో: 114 (2019) 55. డేవిడ్ వార్నర్: 100 నాటౌట్ (2019) 56. కేఎల్ రాహుల్: 100 నాటౌట్ (2019) 57. విరాట్ కోహ్లీ: 100 (2019) 58. అజింక్య రహానే: 105 (2019) 59. కేఎల్ రాహుల్: 132 నాటౌట్ (2020) 60. మయాంక్ అగర్వాల్: 106 (2020)
వివరాలు
ఐపీఎల్‌లో శతకాలు బాదిన ఆటగాళ్లు
61. శిఖర్ ధావన్: 101 నాటౌట్ (2020) 62. శిఖర్ ధావన్: 106 నాటౌట్ (2020) 63. బెన్ స్టోక్స్: 107 నాటౌట్ (2020) 64. సంజు శాంసన్: 119 నాటౌట్ (2021) 65. దేవదత్ పడిక్కల్: 101 నాటౌట్ (2021) 66. బట్లర్: 124 (2021) 67. రుతురాజ్ గైక్వాడ్: 101 నాటౌట్ (2021) 68. బట్లర్: 100 (2022) 69. కేఎల్ రాహుల్: 103 నాటౌట్ (2022) 70. బట్లర్ :103 (2022)
వివరాలు
ఐపీఎల్‌లో శతకాలు బాదిన ఆటగాళ్లు
71. బట్లర్: 116 (2022) 72. కేఎల్ రాహుల్: 103 నాటౌట్ (2022) 73. క్వింటన్ డి కాక్: 140 నాటౌట్ (2022) 74.రజత్ పటిదార్:112 నాటౌట్ (2022) 75. బట్లర్: 106 నాటౌట్ (2022) 76. హ్యారీ బ్రూక్: 100 నాటౌట్ (2023) 77. వెంకటేష్ అయ్యర్: 104 (2023) 78. యశస్వి జైస్వాల్: 124 (2023) 79. సూర్యకుమార్ యాదవ్: 103 నాటౌట్ (2023) 80. ప్రభసిమ్రాన్ సింగ్: 103 (2023)
వివరాలు
ఐపీఎల్‌లో శతకాలు బాదిన ఆటగాళ్లు
81. శుభమాన్ గిల్: 101 (2023) 82. హెన్రిచ్ క్లాసెన్: 104 (2023) 83. విరాట్ కోహ్లీ: 100 (2023) 84. కామెరాన్ గ్రీన్: 100 నాటౌట్ (2023) 85. విరాట్ కోహ్లీ: 101 నాటౌట్ (2023) 86. శుభమాన్ గిల్: 104 నాటౌట్ (2023) 87. శుభమాన్ గిల్: 129 (2023) 88. విరాట్ కోహ్లీ: 113 నాటౌట్ (2024) 89. బట్లర్: 100 నాటౌట్ (2024) 90. రోహిత్ శర్మ: 105 నాటౌట్ (2024)
వివరాలు
ఐపీఎల్‌లో శతకాలు బాదిన ఆటగాళ్లు
91. ట్రావిస్ హెడ్: 102 (2024) 92. సునీల్ నరైన్: 109 (2024) 93. బట్లర్: 107 నాటౌట్ (2024) 94. యశస్వి జైస్వాల్: 104 నాటౌట్ (2024) 95. రుతురాజ్ గైక్వాడ్: 108 నాటౌట్ (2024) 96. మార్కస్ స్టోయినిస్: 124 నాటౌట్ (2024) 97. జానీ బెయిర్‌స్టో: 108 నాటౌట్ (2024) 98. విల్ జాక్స్: 100 నాటౌట్ (2024) 99. సూర్యకుమార్ యాదవ్: 102 నాటౌట్ (2024) 100. శుభమాన్ గిల్: 104 (2024) 101. సాయి సుదర్శన్: 103 (CSKపై, 2024)