LOADING...
Gautam Gambhir : ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు తిరిగి రానున్న గౌతమ్‌ గంభీర్‌!..ఎందుకంటే..? 
ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు తిరిగి రానున్న గౌతమ్‌ గంభీర్‌!..ఎందుకంటే..?

Gautam Gambhir : ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు తిరిగి రానున్న గౌతమ్‌ గంభీర్‌!..ఎందుకంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ తాత్కాలికంగా ఇంగ్లండ్ నుంచి భారత్‌కి తిరిగి వస్తున్నారని సమాచారం. గంభీర్‌ ఈ నిర్ణయం తీసుకోవడానికి కుటుంబ సంబంధిత అత్యవసర పరిస్థితి కారణమైందని తెలుస్తోంది. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌ల కోసం భారత ఏ జట్టు ముందుగా ఇంగ్లండ్‌కి చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లలో గంభీర్‌ ప్రత్యక్షంగా పాల్గొని, ఆటగాళ్ల ప్రదర్శనను సుదీర్ఘంగా గమనించారు. అదే సమయంలో భారత సీనియర్‌ జట్టు ఇంకా ఇంగ్లండ్‌కి చేరకముందే ఆయన అక్కడికి వెళ్లడం గమనార్హం. ఇక శుక్రవారం నుంచి భారత జట్టు అంతర్గతంగా ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌ నిర్వహిస్తోంది.

వివరాలు 

జూన్ 20న ఇంగ్లండ్‌తో మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ 

ఇదే సమయంలో గంభీర్‌ తన కుటుంబంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితి కారణంగా భారత్‌కు తిరిగి ప్రయాణమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇదే తరహాలో గతంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలో కూడా గంభీర్‌ ఆస్ట్రేలియా టూర్‌ నుంచి స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గంభీర్‌ జట్టుకు దూరమవుతున్న నేపథ్యంలో,శుక్రవారం ప్రారంభమయ్యే నాలుగు రోజుల ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌కు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డొయిశే పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్‌తో పాటు మిగతా కోచింగ్ సిబ్బంది పూర్తి మద్దతు అందించనున్నారు. జూన్ 20న ఇంగ్లండ్‌తో మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభంకానుండగా, ఆ మ్యాచ్‌కు ముందే గంభీర్ తిరిగి జట్టులో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.