MS Dhoni -Gambhir-IPL: ధోనీ చివరి ఓవర్ వరకూ ఉంటే మ్యాచ్ అంతే సంగతులు: గంభీర్
క్రికెటర్ ఎంఎస్ ధోనీ మ్యాచ్ లో చివరి వరకూ క్రీజులో ఉంటే కచ్చితంగా ప్రత్యర్థి జట్టు నుంచి మ్యాచ్ ను లాగేసుకుంటాడని క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా చెన్నై జట్టు మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగేముందు గంభీర్ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎంఎస్ ధోని ప్రణాళికలు బాగుంటాయని, బ్యాట్సమెన్ల పై ఒత్తి డి తెచ్చేందుకు గ్రౌండ్ లో ఫీల్డర్ల మోహరింపు బాగుంటుందని ప్రశంసించాడు. తనకు ఎంఎస్ ధోని తో మంచి ఫ్రెండ్ షిప్ ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుతానికి కోల్కతా అద్భుతమైన ఫామ్ లో ఉన్నా చెన్నై టీంను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని హెచ్చరికలు పంపాడు. ఎందుకంటే అవతల ధోనీ ఉన్న సంగతి మరవద్దని చెప్పాడు.
ధోని కి ఆ సంగతి బాగా తెలుసు: గంభీర్
ధోనికి స్పిన్నర్లను ఎలా ఎదుర్కొవాలో బాగా తెలుసన్నాడు. ఆఖరి ఓవర్ లో 20 పరుగుల లక్ష్యం ఉన్నా ఏమాత్రం అదరడు బెదరడని ఆఖరి ఓవర్ లో ఆ 20 పరుగులు చేయడం ధోనీకి చాలా తేలికైన పని అని గంభీర్ పేర్కొన్నాడు. ఇక తాను ఐపీఎల్ లో ఆడినప్పుడు చెన్నైను మూడోసారి కప్పును ముద్దాడకుండా చేయడం తనకు గర్వంగా ఉందని చెప్పాడు. ఆ ఫైనల్ మ్యాచ్ లో ధోనీ టీమ్ చెన్నై జట్టుపై విజయం సాధించడం మహా సంతోషాన్నిచ్చిందని నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు.