
Rohit Sharama: రోహిత్ శర్మ నిర్ణయాన్ని తప్పుబట్టిన గవాస్కర్.. అశ్విన్ ఏం తప్పు చేశాడంటూ మండిపాటు!
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా దిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆఫ్గానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి .
ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆఫ్గాన్ సేన ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)ను తప్పించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.
ఈ మ్యాచులో అశ్విన్ ను తప్పించి శార్దుల్ ఎంపిక చేయడాన్ని గవాస్కర్ తప్పుబట్టాడు.
ఆస్ట్రేలియాతోనే ఆడిన టీమ్ నుంచి ఆశ్విన్ ను తప్పించారని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ (Rohit Sharma) చెప్పగానే గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇక మహ్మద్ షమీని తీసుకోకపోవడంపై కూడా గవాస్కర్ విమర్శించారు.
Details
మహ్మద్ షమీని తప్పించడం అన్యాయం
2019 వరల్డ్ కప్ టీమ్‌లో ఆఫ్గాన్ జట్టుపై హ్యాట్రిక్ వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ షమీని, ఈ మ్యాచులో ఎంపిక చేసి ఉంటే బాగుండేదని సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అభిప్రాయపడ్డాడు.
ఇక రవిచంద్రన్ అశ్విన్ ను ఏం తప్పు చేశాడో తనకు తెలియదని, రోహిత్ నిర్ణయాన్ని వాస్కర్ తప్పుబడ్డాడు.
అక్షర పటేల్ గాయపడటంతో వన్డే వరల్డ్ కప్ జట్టులో రవిచంద్రన్ అశ్విన్ చోటు సంపాదించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో అశ్విన్ 10 ఓవర్లలో 34 రన్స్ ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.