IPL 2026: అభిమానులకు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ 2026 కోసం 15 సిటీల్లో ఫ్యాన్ పార్కులు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ, దేశవాళీ క్రికెటర్ల సందడితో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుండగా, జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్‌లతో సిద్ధమవుతున్నాయి. ఈసారి పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయకుండా, తొలి 20 మ్యాచ్‌ల జాబితానే ప్రకటించారు. మార్చి 28న సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అభిమానుల కోసం 'ఫ్యాన్ పార్కులు' ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి కలిగించేందుకు బీసీసీఐ దేశవ్యాప్తంగా 'ఫ్యాన్ పార్క్'లను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా ఇవన్నీ వీకెండ్‌ల్లో నిర్వహించబడుతున్నాయి.
వివరాలు
ప్రతి ఫ్యాన్ పార్కులో
లైవ్ మ్యాచ్ స్క్రీనింగ్ మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు ఫుడ్ కోర్టులు చిన్నారుల కోసం ప్రత్యేక గేమింగ్ జోన్‌లు వర్చువల్ బ్యాటింగ్, బౌలింగ్ నెట్స్ ఫేస్ పెయింటింగ్, ఫోటో బూత్స్ అభిమానులను అలరించేందుకు ఈ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఫ్యాన్ పార్క్ కాన్సెప్ట్‌ను బీసీసీఐ తొలిసారిగా 2015 ఐపీఎల్ సీజన్‌లో ప్రవేశపెట్టింది.
వివరాలు
ఎప్పుడు.. ఎక్కడ?
మూడు వీకెండ్‌లలో మొత్తం 15 నగరాల్లో ఈ ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. మొదటి వారం (మార్చి 28 & 29) రోహ్‌తక్ భోపాల్ నాగ్‌పూర్ తుమకూరు కృష్ణానగర్ రెండో వారం (ఏప్రిల్ 4 & 5) మథుర జోధ్‌పూర్ మైసూరు భువనేశ్వర్ నిజామాబాద్ మూడో వారం (ఏప్రిల్ 11 & 12) మేరఠ్ నడియాద్ రత్నగిరి కోయంబత్తూర్ రౌర్‌కెలా ఈ విధంగా, స్టేడియానికి వెళ్లలేని అభిమానులకు కూడా ఐపీఎల్ ఉత్సాహాన్ని దగ్గరగా అనుభవించే అవకాశం బీసీసీఐ కల్పిస్తోంది.