Rishabh Pant : రిషభ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్
ఐపీఎల్(IPL) 2024 వేలానికి ముందు రిషభ్ పంత్ (Rishabh Pant) అభిమానులకు శుభవార్త అందింది. వచ్చే సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున రిషభ్ పంత్ బరిలోకి దిగుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. గతేడాది కారు ప్రమాదంలో గాయపడిన పంత్, 2024 సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సేవలందిస్తాడని పలు వార్తా సంస్థలు చెబుతున్నాయి. పంత్ రీ ఎంట్రీపై ఢిల్లీ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారి ప్రకటన వెలువడలేదు. అయితే పంత్ రీఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు జోరుగా రావడంతో డిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు శుభవార్త అందింది. పంత్ తాజాగా పార్థివ్ పటేల్, జహీర్ ఖాన్ తో కలిసి ఓ నైట్ పార్టీకి అటెండ్ అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
నైట్ పార్టీకి అటెండ్ అయిన రిషభ్ పంత్
రిషభ్ పంత్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతోనే పార్టీకి అటెండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న పంత్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శనతో చివరి నుంచి రెండో స్థానానికి పడిపోయింది. క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించకుండానే లీగ్ దశ నుంచి దిల్లీ క్యాపిటల్స్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో 98 మ్యాచులాడిన ఆడి 2838 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 15 హాఫ్ సెంచరీలను బాదాడు. అతని ఖాతాలో 18 స్టంపింగ్‌లు ఉన్నాయి.