AFG vs SA: అదరగొట్టిన సౌతాఫ్రికా.. 107 పరుగుల తేడాతో భారీ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కరాచీలో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో సౌతాఫ్రికా 107 పరుగుల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. అప్ఘనిస్తాన్ బ్యాటర్లలో రహమత్ షా 90 పరుగుల మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ(0) డకౌట్‌తో తీవ్రంగా నిరాశపరిచారు. అప్ఘనిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు.
Details
సెంచరీతో చెలరేగిన ర్యాన్ రికెల్టన్
ఇక సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ 3, వియాన్ ముల్డర్ , లుంగీ లింగిడి తలా రెండు వికెట్లతో రాణించారు.
సౌతాఫ్రికా బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్ (103) శతకం బాదాడు.
ఆ తర్వాత కెప్టెన్ బవుమా (58), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (52), మార్క్రమ్ (52) అర్ధ సెంచరీలతో రాణించారు.
ఆఫ్ఘానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ నబీ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. ఫజల్హాక్ ఫారూఖీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.