PAK Vs BAN : బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన పాకిస్థాన్
కోల్ కత్తా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 45.1 ఓవర్లలో 204 పరుగులు చేసి ఆలౌటైంది. లక్ష్య చేధనలో పాక్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. ఆరంభంలోనే పాక్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లా బ్యాటర్లు తడబడ్డారు. షాహీన్ ఆఫ్రిది, మహ్మద్ వసీ చెరో మూడు వికెట్ల చెలరేగడంతో బంగ్లా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(56), లిట్టిన్ దాస్(45), కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (43) పరుగులు చేయడంతో బంగ్లా 200 మార్కును దాటగలిగింది.
హాఫ్ సెంచరీలతో రాణించిన పాక్ ఓపెనర్లు
లక్ష్య చేధనకు దిగిన పాకిస్థాన్ ఓపెనర్లు బంగ్లా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోన్నారు. అబ్దుల్లా షఫీక్(68), ఫఖర్ జమాన్(81) హాఫ్ సెంచరీలతో చెలరేగి బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 128 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెంచరీకి చేరువలో ఉన్న ఫఖర్ జమాన్, మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇక ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన పాక్ కెప్టెన్ బాబార్ అజామ్ (9) మరోసారి నిరాశపరిచాడు. చివర్లో మహ్మద్ రిజ్వాన్(25*), ఇఫ్తికర్ ఆహ్మద్(17*) జట్టుకు విజయాన్ని అందించారు. పాక్ 32.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి పాక్ 205 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ 3 వికెట్లు పడగొట్టి ఫర్వాలేదనిపించాడు.