
IPL 2025: గుజరాత్ టీంలో కీలక మార్పు.. గాయపడిన ఫిలిప్స్ స్థానంలో లంక ఆల్ రౌండర్ దాసున్ షనక..
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్ టైటాన్స్ తమ జట్టులో ఒక కీలక మార్పును చేసింది. గాయపడిన ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేసింది.
ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్ గాయం పాలయ్యాడు.
ఆ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ చేస్తున్న సమయంలో,ఇషాన్ కిషన్ పరుగుల కోసం ప్రయత్నిస్తుండగా ఫిలిప్స్ రనౌట్ చేయబోయే క్రమంలో తొడ కండరాల్లో గాయమైంది.
ఈ గాయం కారణంగా వెంటనే అతడిని డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించారు.
అనంతరం గాయ తీవ్రత ఎక్కువగా ఉన్నందున,మెరుగైన చికిత్స కోసం ఫిలిప్స్‌ను స్వదేశమైన న్యూజిలాండ్‌కు పంపించారు.
ఈ సీజన్‌లో గుజరాత్ తరఫున ఫిలిప్స్ ఒక్క మ్యాచ్‌లో కూడా బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయలేకపోయాడు.
వివరాలు
గ్లెన్ ఫిలిప్స్ - మూడు జట్ల తరఫున ప్రయాణం
కానీ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలోనే అతడు దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు.
ఫిలిప్స్ స్థానాన్ని భర్తీ చేయడానికి గుజరాత్ టీమ్ శ్రీలంక మాజీ కెప్టెన్ దాసున్ షనకను ఎంపిక చేసింది. ఈ మార్పుకు ఐపీఎల్ నిర్వాహకులు కూడా అంగీకారం తెలిపారు.
గ్లెన్ ఫిలిప్స్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో మూడు విభిన్న జట్ల తరఫున ఆడాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్,సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించినా, తుది జట్టులో ఎక్కువగా అవకాశాలు లభించలేదు.
మొత్తంగా ఇప్పటివరకు 8 మ్యాచ్‌లలో మాత్రమే ఆయన ఆటకు అవకాశం దక్కింది.
వివరాలు
ఫిలిప్స్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్
గత ఏడాది జరిగిన మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ ఫిలిప్స్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌ల వరకు పూర్తి అవుతున్నప్పటికీ, తుది జట్టులో ఫిలిప్స్‌కు ఒక్క అవకాశం కూడా రాలేదు.
గత సీజన్‌లో ఫీల్డింగ్ సమయంలో మంచి ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఫిలిప్స్, ఈసారి మాత్రం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా గాయపడి టోర్నీకి దూరమయ్యాడు.
ఇదిలా ఉండగా, గుజరాత్ టీమ్ శ్రీలంక ఆల్‌రౌండర్ దాసున్ షనకతో రూ. 75 లక్షల ఒప్పందం చేసుకుంది.
వివరాలు
ఆల్ రౌండర్ గా గుర్తింపు..
దాసున్ షనకకు ఆల్‌రౌండర్‌గా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది.
శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, 102 టీ20 మ్యాచ్‌ల్లో ఐదు అర్థసెంచరీలు చేయడంతో పాటు 33 వికెట్లు కూడా తీశాడు.
అంతేకాక 71 వన్డేలు, 6 టెస్టులు కూడా ఆడాడు. 2022లో జరిగిన ఆసియా కప్‌ను శ్రీలంక గెలుచుకున్న సమయంలో షనక కెప్టెన్‌గా కీలకపాత్ర పోషించాడు.
గత సీజన్‌లో కూడా గుజరాత్ తరఫున షనక ఆడిన సందర్భం ఉంది. ఆ సమయంలో కేన్ విలియమ్సన్ గాయపడటంతో, అతని స్థానంలో షనక రీప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చాడు.
వివరాలు
గుజరాత్ ప్రస్తుత ప్రదర్శన
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోంది.
ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో 4 విజయాలు, 2 పరాజయాలతో మొత్తం 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది.
2022లో టైటిల్ గెలుచుకున్న గుజరాత్, గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది.
తర్వాతి మ్యాచ్‌లో గుజరాత్, శనివారం అహ్మదాబాద్ వేదికగా టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎదుర్కొనుంది.
ఈ మ్యాచ్ గుజరాత్ విజయయాత్రను కొనసాగించగలదా అన్న ఆసక్తి నెలకొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గుజరాత్ టైటాన్స్ చేసిన ట్వీట్
Major Update! Dasun Shanaka has signed with Gujarat Titans for IPL 2025, stepping in as a replacement for Glenn Phillips. A dynamic new power hitter enters the arena! 🚀#IPL #IPL2025 #Champions #chennaisuperkings #delhicapitals #gujaratgiants #kolkataknightriders… pic.twitter.com/x63sbtXPa1
— MGLion (@gamesmglion) April 18, 2025