
RCB vs GT: ఆర్సీబీపై గుజరాత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూర్ వేదికగా ఆర్సీబీ(RCB)కి గట్టి షాక్ తగిలింది. ఇవాళ గుజరాత్ జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది.
బెంగళూరు నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
జోస్ బట్లర్ (73*: 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులు) విధ్వంసకర ఆటతీరు ప్రదర్శించగా, సాయిసుదర్శన్ (49: 36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
చివర్లో రుథర్‌ఫర్డ్ (30*: 18 బంతుల్లో) చక్కటి ఆటతో గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు.
బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్‌వుడ్ తలో వికెట్ తీసుకున్నారు.
Details
లివింగ్‌స్టోన్ మెరుపులు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
లియామ్ లివింగ్‌స్టోన్ (54; 40 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సులు) అర్థ శతకం సాధించగా, జితేశ్ శర్మ (33; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (32; 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) మంచి షాట్లు ఆడారు.
అయితే టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. విరాట్ కోహ్లీ (7), దేవ్‌దత్ పడిక్కల్ (4), కృనాల్ పాండ్య (5) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఫిల్ సాల్ట్ (14), రజత్ పటీదార్ (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు.
Details
కోహ్లీ ఔట్‌తో ఆర్సీబీకి భారీ షాక్
గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ (3/19) అద్భుత ప్రదర్శన చేశాడు. సాయి కిశోర్ 2 వికెట్లు తీసుకోగా, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే బెంగళూరుకు గట్టి దెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న కోహ్లీని అర్షద్ ఖాన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే పెవిలియన్‌కు పంపాడు.
విరాట్ డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం మహ్మద్ సిరాజ్ తన వరుస ఓవర్లలో పడిక్కల్, ఫిల్ సాల్ట్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి బెంగళూరును మరింత దెబ్బతీశాడు.
Details
చివర్లో టిమ్ డేవిడ్ మెరుపులు
4.3 ఓవర్‌లో ఫిల్ సాల్ట్ భారీ సిక్స్ కొట్టిన వెంటనే, అతడిని ఔట్ చేసి సిరాజ్ రివెంజ్ తీర్చుకున్నాడు.
ఈ క్రమంలో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో రజత్ పటీదార్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
లివింగ్‌స్టోన్, జితేశ్ కలిసి ఐదో వికెట్‌కు 38 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యం అందించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.
చివరి ఓవర్‌లో ప్రసిద్ధ్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ వరుసగా 4, 6, 4 బాదడంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోరును చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గుజరాత్ టైటాన్స్ గెలుపు
They came to Bengaluru with a motive 💪
— IndianPremierLeague (@IPL) April 2, 2025
And they leave with 2⃣ points 🥳@gujarat_titans complete a comprehensive 8⃣-wicket victory ✌️
Scorecard ▶ https://t.co/teSEWkWPWL #TATAIPL | #RCBvGT pic.twitter.com/czVroSNEml