
RCB VS GT: ఆర్సీబీపై గుజరాత్ గెలుపు.. గిల్ వ్యాఖ్యలతో కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
అయితే ఈ విజయానంతరం గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ కొత్త వివాదానికి తెరలేపింది.
విరాట్ కోహ్లీ - గిల్ మధ్య మనస్పర్థలేమైనా ఉన్నాయా? లేక ఆర్సీబీ అభిమానులపై గిల్ అసహనం వ్యక్తం చేశాడా? అనే చర్చ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Details
గిల్ వివాదాస్పద పోస్ట్!
మ్యాచ్ గెలిచిన తర్వాత గిల్ ఆనందం వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్‌లో "మా దృష్టి ఆటపై ఉంది, అరిచే గోలపై కాదని పేర్కొన్నాడు.
ఈ ఏడు పదాల సందేశం ఆర్సీబీ ఓటమిని ఉద్దేశించినదే అని అభిమానులు అనుకుంటున్నారు. ముఖ్యంగా చివరి మూడు పదాలపై క్రికెట్ ప్రేమికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎవరిని ఉద్దేశించి చెప్పాడు?
చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అభిమానుల హోరాహోరీ అరుపుల గురించా? లేక గిల్ వికెట్ పడినప్పుడు కోహ్లీ సంబరాలు చేసుకున్న దృశ్యాన్ని ఉద్దేశించాడా? అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.
చాలా మంది గిల్ ఈ వ్యాఖ్యలు కోహ్లీపై చేసినట్లు భావిస్తున్నారు.
Details
గిల్ సోదరి వివాదం?
మరోవైపు కొంత మంది మాత్రం గిల్ - కోహ్లీ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, ఈ పోస్ట్ కోహ్లీకి సంబంధించిందని భావించడం తప్పని అంటున్నారు.
గతేడాది ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీని ఓడించినప్పుడు, గిల్ సోదరి షానీల్ పెట్టిన ఓ పోస్ట్‌కు ఆర్సీబీ అభిమానులు తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేశారు.
ఇప్పుడు గిల్ తన తాజా వ్యాఖ్యలతో ఆ ట్రోలింగ్‌కు ప్రతిస్పందన ఇచ్చినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు.